జీడి పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:58 PM
మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి.

హరిపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మందస మండలం హరిపురంలోని వెంకటబాలాజీ జీడి పరిశ్రమలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అల్లుల్ల కాలనీ సమీపంలోని నల్ల జశ్వంత్‌కు చెందిన ఈ పరిశ్రమలో రాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్క పరిశ్రమలో ఉన్న కార్మికులు, కాలసీ వాసులు అప్రమత్తమై పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన వారంతా అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమలో జీడిపిక్కలు, రవాణాకు సిద్ధంగా ఉన్న జీడి పప్పు అగ్నికి ఆహుతైనట్టు తెలిపారు. సుమారు రూ.2కోట్ల వరకూ ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. సంఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.