Share News

బారువలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:44 PM

బారువలోని ఓ టీ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సం భవించింది.

బారువలో అగ్ని ప్రమాదం

సోంపేట: బారువలోని ఓ టీ దుకాణంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం సం భవించింది. ఈ సంఘటనలో రూ.80 వేల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితుడు బోటో కృష్ణ తెలిపాడు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

గార మండలంలో తోటలు..

గార: శ్రీకూర్మం, నగిరెడ్లపేట గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తూ జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు నాలుగు ఎకరాలు విస్తీర్ణంలో కొబ్బరి, జీడి, మామిడి, నీలగిరి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం నుంచి రెండు అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలు అదుపు చేశాయి. గార తహసీల్దార్‌ కె.కృష్ణ, ఆర్‌ఐ అనిల్‌ కుమార్‌, వీఆర్వో జగదీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 19 మంది రైతులకు చెందిన చెట్లు కాలిపోవడంతో అధికారులు పంట నష్టం అంచనా వేసి నివేదికను సంబంధిత అధికారులకు పంపించారు.

Updated Date - Apr 02 , 2024 | 11:44 PM