Share News

బీచ్‌ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఖరారు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:22 PM

రాష్ట్రస్థాయి బీచ్‌ కబడ్డీ పురుషులు, మహిళల పోటీలకు జిల్లా జట్లు ఖరారు చేశారు. శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీ దరిలో ఉన్న నాగావళి నదిలో ఆదివారం బీచ్‌ కబడ్డీ పోటీలకు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వ హించారు.

బీచ్‌ కబడ్డీ పోటీలకు జిల్లా జట్ల ఖరారు
బీచ్‌ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు :

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి బీచ్‌ కబడ్డీ పురుషులు, మహిళల పోటీలకు జిల్లా జట్లు ఖరారు చేశారు. శ్రీకాకుళంలోని శాంతినగర్‌కాలనీ దరిలో ఉన్న నాగావళి నదిలో ఆదివారం బీచ్‌ కబడ్డీ పోటీలకు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వ హించారు.ఈమేరకు తుదిజట్టును కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్య దర్శి సాధు శ్రీనివాసరావు ప్రకటించారు. వీరంతా నెల్లూరు జిల్లాలో ఆగస్టు రెండు నుంచి నాలుగో తేదీ వరకు జరగనున్న రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటా రు. పర్యవేక్షకులుగా సీనియర్‌ కబడ్డీ క్రీడాకారులు సాధు కోటేశ్వరరావు, డితవిటమ్మ, జి.యమునారాణి పాల్గొని జట్ల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. కార్య క్రమంలో శిక్షకులు ఎస్‌.సింహాచలం, కె.జాన్సీ పాల్గొన్నారు.

ఫ పురుషుల జట్టు: పి.యుగంధర్‌ (సింగుపురం), పి.మణికంఠ, పి.గణేష్‌ (పాలకొండ), పి.పవన్‌(కవిటి), పి.తరుణ్‌(శ్రీకాకుళం), ఎస్‌.రామ్‌మోహన్‌రావు (ఆకులపేట).ఫమహిళజట్టు: హర్షిత(పల్లిసారధి), ఎస్‌.హసీనా (తోటపాలెం), కె. శ్రావణి (రణస్థలం), టి.లీస, టి.యమున, బి.సింధుజ (పల్లిసారధి).

Updated Date - Jul 28 , 2024 | 11:22 PM