Share News

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:14 AM

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుం దని ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి చల్ల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం
నరసన్నపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి చల్ల శ్రీనివాస్‌

నరసన్నపేట: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుం దని ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి చల్ల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. పీఆర్సీ ని అమలు, సీపీఎస్‌ రద్దు, బకాయిల చెల్లింపులు, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయా లని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ కనకారావుకు వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో సంఘం జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.వేణుగోపాలరావు, తాలుకా కార్యదర్శి టి. మోహనరావు, ఎన్‌.రవికుమార్‌, మురళీకృష్ణ, విజయ్‌రాథో, చందన, రమేష్‌, లక్ష్మణ్‌, వీఆర్వోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెల్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.

డీటీకి వినతిపత్రం

పలాసరూరల్‌: ఉద్యోగుల సమస్యల ను పరిష్కరించాలని ఏపీఎన్జీవో అసోసి యేషన్‌ పలాస అధ్యక్షుడు బోనెల గోపాల్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు బుధవారం డీటీ లక్ష్మీనారాయణ కు వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు న్నరేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని, దీంతో పోరుబాట పట్టామన్నారు. కార్యక్రమంలో సంఘం వైస్‌ ప్రెసి డెంట్‌ పి.శ్రీనివాసరావు, ట్రెజరర్‌ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిరసన

నందిగాం: ఏసీజేఏసీ పిలుపుమేరకు బుధ వారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిర సన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్య మ కార్యాచరణలో భాగంగా పెదతామరాపల్లి పాఠ శాల ఆవరణలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, సీపీఎస్‌ రద్దు, ఓపీఎస్‌ను పునరుద్ధ రించాలని డిమాండ్‌ చేశారు. బి.శంకరరావు, కె.గున్నయ్య, వి.కుమారి పాల్గొన్నారు.

నల్లబ్యాడ్జీలు ధరించి..

ఆమదాలవలస: ఆమదాలవలసలో ఏపీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధ వారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీ లు ధరించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌ కె.వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్ర మంలో అసోసియేషన్‌ మండలాధ్యక్షుడు జి.హరికుమార్‌, ఉపాధ్యక్షుడు గురుగుబిల్లి రాము, ట్రెజరర్‌ షేక్‌ బాషా, జాయింట్‌ సెక్రటరీ కె.మనోహర్‌, సుజాత, లీలారాణి, శ్రీలత పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:14 AM