ఫీల్డ్ అసిసెంట్‌ను తొలగించాల్సిందే..
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:38 PM
ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడుతూ సక్రమంగా విధులు నిర్వర్తించకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్న క్షేత్ర సహాయకురాలిని తొలగించాలని దండులక్ష్మీపురం వేతనదారులు కోరారు.

డీఎల్‌పురం(పోలాకి): ఉపాధి హామీ పనుల్లో అక్ర మాలకు పాల్పడుతూ సక్రమంగా విధులు నిర్వర్తించ కుండా నిధులు దుర్వినియోగం చేస్తున్న క్షేత్ర సహాయకురాలిని తొలగించాలని దండులక్ష్మీపురం వేతనదారులు కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్‌పై జిల్లా ఉన్నతాధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఉపాధి ఏపీడీ బి.మురళీకృష్ణ శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వేత నదారులు అక్కడికి చేరుకుని క్షేత్రసహాయకురాలు తులసిని తప్పించాల్సిందేనని భీష్మించారు. గ్రామస్థులు మాట్లాడుతూ.. ఉపాఽధి హామీ పనుల్లో తనకు నచ్చిన వారికి మస్టర్ వేయడం, పనికి వెళ్లకుండా వేతనం చెల్లించడం, పెద్దలపై కనీస గౌరవం లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ ఫిర్యాదు చేయగా మీరు విచారణకు వచ్చినా ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వైసీపీ నేతలు చెప్పిన వారికే మస్టర్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారని లిఖిత పూర్వకం గా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారులు, ఫీల్డ్ అసిస్టెంట్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. సుమారు అరగంట పాటు ఏపీడీ ఎదుట వారు వాదించుకున్నారు. అనంతరం సచివాలయం బయటకు వచ్చి ఫిర్యాదుదారులు, క్షేత్రసహాయ కురాలి అనుచరులు పెద్ద స్వరంతో వాదించుకున్నారు. విచారణకు వచ్చిన అధికారులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూ లాన్ని తీసుకుని వెనుదిరిగారు. కార్యక్రమంలో ఏపీఓవో రమణారావు, ఈసీ పి.మునీందర్, గ్రామపెద్ద కరుకోల రామారావు తదితరులు పాల్గొన్నారు.