కోటి కాంతుల దీపోత్సవం
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:42 PM
కార్తీక సోమవారం సంధ్య వేళ.. కోటి దీపకాంతులతో సిక్కోలు నగరం దేదీప్యమైంది. శ్రీకాకుళంలోని కత్తెరవీధి మైదానంలో (పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ వెనుక) సోమవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కోటి దీపోత ్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కార్తీక సోమవారం సంధ్య వేళ.. కోటి దీపకాంతులతో సిక్కోలు నగరం దేదీప్యమైంది. శ్రీకాకుళంలోని కత్తెరవీధి మైదానంలో (పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ వెనుక) సోమవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కోటి దీపోత ్సవం వైభవంగా నిర్వహించారు. పుణ్యపువీధికి చెందిన శ్రీ సీతారామ సహిత ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్త, విశ్రాంత బ్యాంకు అధికారి ముక్కాల కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందలాది మహిళలు, భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. ప్రధాన వేదిక వద్ద అరసవల్లికి చెందిన రుత్వికులు హరి సూర్య ప్రసాద్ శర్మ, ఒడిశా నుంచి వచ్చిన ఉమామహేశ్వర సిద్ధాంతి ప్రవచనాలు చేశారు. శాస్త్రోక్తంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు 108మంది దంపతులచే 108 శివలింగాల వద్ద రుద్రాభిషేకాలు, దశవిధ హారతుల పూజలు నిర్వహించారు. కార్తీకమాసం విశిష్టత వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులతోపాటు దుప్పల వెంకటరావు, ముక్కాల కొండబాబు, రాళ్ళపాటి అరవింద, ఎం.నారాయణరావు, సుంకర కృష్ణ పాల్గొన్నారు.