Share News

అంగరంగ వైభవంగా జాతరలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:06 AM

కనుమ పురస్కరించుకుని మంగళవారం అంగరంగ వైభవంగా జాతరలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో భక్తులు అవస్థలకు గురయ్యారు.

అంగరంగ వైభవంగా జాతరలు
ఆమదాలవలస: తొగరాంలో జాతరకు తరలివచ్చిన భక్తులు

కనుమ పురస్కరించుకుని మంగళవారం అంగరంగ వైభవంగా జాతరలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో భక్తులు అవస్థలకు గురయ్యారు.

ఫపలాస: డేకురుకొండ యాత్ర సోమవారం రాత్రి ఘనంగా నిర్వహిం చారు. ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాన ఈ యాత్రను హడ్కో కాలనీ వద్ద ఉన్న డేకురుకొండపై చేపట్టడం ఆనవాయితీ. సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లు, చుట్టాలు, బంధువులు పెద్ద ఎత్తున ఈ యాత్రకు వచ్చి మొక్కులు తీర్చుకు న్నారు. పిల్లలు లేని దంపతులు ఈ కొండపై నుంచి జారితే పిల్లలు పుడతా రని భక్తుల నమ్మకం. ఈ కొండపై తర్లాకోట జమిందార్లు ఆలయాలు కట్టించి నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఏడాది అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి డేకు రుకొండ యాత్రలో పాల్గొన్నారు కనుము సందర్భంగా మంగళవారం సాయం త్రం స్థానిక సీతమ్మతల్లి గుడి వద్ద యాత్రను నిర్వహించారు. అమ్మవారికి భక్తులు ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ టీడీపీ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణతో పాటు ఉల్లాసపేట, పలాస ప్రాంతాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఫ ఆమదాలవలస: మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో ఉన్న సంగమయ్యకొండ జాతరకు భక్తులు పోటెత్తారు. కొండపై ఉన్న సంగమేశ్వ రాలయంలో ప్రత్యేక పూజలుచేశారు.సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, బూర్జ, ఆమదా లవలస, శ్రీకాకుళం, గారమండలాలతో పాటు ఆమదాలవలస మునిసిపా లిటీకి చెందిన 50 వేలమంది భక్తులు మంగళవారం జాతరకు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. దీంతో అధిక సంఖ్యలో వాహనాలు రావడంతో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్‌ చేయంతో మూడుగంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి రైళ్లు, ప్రైవేటు బస్సులు తప్పిపోయి ఇబ్బందులు పడ్డారు.

ఫ జి.సిగడాం: మండలంలోని గెడ్డకంచరాం దేవగప్తాపు సన్యాసిరావు వనంలో వెలసిన పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజ లు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతోపాటు గ్రామ పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకునేం దుకు వస్తారని ఆలయకమిటీసభ్యులు తెలిపారు.అలాగే సంతవురిటిలో సోమ వారం భోనాల పండగను వైభవంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలు ముర్రాటలతో పేరంటాలకు భోనాలు సమర్పించారు. సర్పంచ్‌ బుడారి లక్ష్మణరావు, గ్రామపెద్దలు బాలబోమ్మ వెంకటశ్వరరావు, బి.సన్యాసిరావు, పిల్లల శివకుమార్‌, సీహెచ్‌ఆర్‌కే రంగారావు, టి.వెంకటరావు గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వందలాది మంది మహిళలు మొక్కులు తీర్చుకున్నారు.

ఫసరుబుజ్జిలి:మండలంలోని పెద్దపాలెం సమీపంలో ఉన్న దంతపురి క్షేత్రంలో నిర్వహించిన సోమాలమ్మ తల్లి జాతరకు పెద్దపాలెం, చిన్నపాలెం, పాలవలస, రావివలస, పురుషోత్తపురం, కొండవలస, రొట్టవలస భక్తులు తరలివచ్చారు. ఫ ఆమదాలవలస: మండలంలోని తొగరాంలో వల్లభ నారాయణ స్వామి, వరహా లక్ష్మీనృసింహస్వామి ఆలయాల వద్ద కనుమ రోజు జాతర నిర్వహించారు. గతంలో సంక్రాంతి, కనుమ, ముక్కొనుమ మూడు రోజులు యాత్ర నిర్వహించేవారు.

ఫ నరసన్నపేట: మండలంలో సంతతోటలో శ్రీవేంకటేశ్వరాలయంలో పార్వేట ఉత్సవాన్ని అర్చకులు చామర్తి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో నిర్వ హించారు. గోదారంగనాథ స్వామి అలక సంబరాలను నిర్వహించి రంగనాథ స్వామి పార్వేట ఉత్సవాన్ని చేపట్టారు. రావాడపేట వద్ద కనకదుర్గ అమ్మవారి 6వ వార్సికోత్సవం సందర్భంగా జాతర చేపట్టారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పారశెల్లిలో జాతర నిర్వహించారు.

ఫ జలుమూరు: అబ్బాయిపేట చెరువుగట్టుపై కొలువుదీరిన శ్రీలక్ష్మీ పేరంటాలమ్మకు సంక్రాంతి సందర్భంగా సోమవారం గ్రామస్థులు ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. మంగళ వాయిద్యాల నడుమ మహిళలు బిందెలతో ఊరేగింపుగా సన్నిధికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో అబ్బాయిపేటతో పాటు కెఎల్‌ఎన్‌పేట, గంగాధరపేట, జోనంకి గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:07 AM