Share News

ఖర్చులో నిబంధనలు పాటించాల్సిందే

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:11 AM

ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం గురించి సగటు ఓటరులో ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత ఖర్చుచేయవచ్చు, ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలు మేరకు ఆచరించాలి. తాజాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో జోరుగా ఎన్నికల ఖర్చు గురించి జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపునకు డబ్బు కీలకంగా మారింది. ఎన్నికల సంఘం నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో వ్యయ పరిమితిపై ఈసీ నిబంధనలు జారీచేసింది.

ఖర్చులో నిబంధనలు పాటించాల్సిందే

హిరమండలం: ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయం గురించి సగటు ఓటరులో ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత ఖర్చుచేయవచ్చు, ఎలా ఖర్చు చేయాలన్న విషయంపై ఎన్నికల కమిషన్‌ నిబంధనలు మేరకు ఆచరించాలి. తాజాగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో జోరుగా ఎన్నికల ఖర్చు గురించి జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపునకు డబ్బు కీలకంగా మారింది. ఎన్నికల సంఘం నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో వ్యయ పరిమితిపై ఈసీ నిబంధనలు జారీచేసింది.

ఇవీ నిబంధనలు

ఫ అభ్యర్థుల వ్యయంపై నియంత్రణలో భాగంగా నామినే షన్లు వేసే వరకు ఖర్చంతా పార్టీ ఖాతా కిందకు వస్తుంది. నామినేషను వేసిన రోజు నుంచి ఎన్నికల వ్యవ విభాగం ఖర్చంతా అభ్యర్థుల ఖాతా కిందే లెక్కిస్తుంది. ఫ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ స్థానానికి రూ.28 లక్షల వరకు ఖర్చుచేసుకోవచ్చని ప్రకటించింది.ఈ పరిమితి దాటితే అనర్హత వేటుపడే అవకాశం ఉంటుంది.

ఫ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా మద్యం, డబ్బులు ప్రవహించకుండా అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆధారా లు లేకుండా నగదు, బంగారం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి నగదుతోపాటు వాహనాలు సీజ్‌ చేస్తున్నారు. దీంతోపాటు ఆయా పార్టీల ఖర్చులు కూడా లెక్కిస్తున్నారు. ఫ నగదు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తామంటే కుదరదు. హంగు ఆర్భాటాలు శ్రుతి మించితే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని కోల్పోవలసి వసుంది. ఫ ఏరోజుకు ఆ రోజు ఖర్చు లెక్కలను నమోదు చేస్తారు.అభ్యర్థులు కూడా ఖర్చుల వివరాలను నమోదు చేసేందుకు రిజిస్టర్‌ను నిర్వ హించాలి. ఫఅభ్యర్థులు ప్రచారానికి సంబందించి కరపత్రా లు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, భోజనాలు తదితర అన్ని అంశాలను కూడా ఎన్నికల అధికారులు పరిశీలిస్తారు.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM