Share News

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి

ABN , Publish Date - Mar 24 , 2024 | 12:11 AM

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవా రంతా నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమదాలవలస నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ పిలుపునిచ్చారు.

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోండి
ఆమదాలవలస: బైక్‌ ర్యాలీలో పాల్గొన్న జేసీ నవీన్‌

- జాయింట్‌ కలెక్టర్‌ నవీన్‌

ఆమదాలవలస: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవా రంతా నిర్భయంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమదాలవలస నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ పిలుపునిచ్చారు. శని వారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కృష్ణాపురం మీ దుగా వన్‌వే జంక్షన్‌ వరకు ర్యాలీ సాగింది. అనంతరం స్థా నిక రైల్వే స్టేషన్‌ ఆవరణలో నిర్వహించన కార్య క్రమంలో జేసీ పాల్గొని మాట్లాడా రు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు ఆశపడకుండా మంచి పరి పాలకుడిని ఎన్నుకొనే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్‌, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురంలో..

ఇచ్ఛాపురం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నిక ల రిటర్నింగ్‌ అధికారి సుదర్శన్‌ దొర అన్నారు. శని వారం ఓటు హక్కు వినియోగంపై ఆర్వో ఆధ్వర్యం లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాల యం నుంచి పురుషోత్తపురం వరకు తిరిగి బస్టాం డ్‌ వరకు వీఆర్వోలు, బీఎల్వోలు, వీఆర్వోలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎలక్షన్‌ డీటీ శ్రీహరి, ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జి.సిగడాంలో..

జి.సిగడాం: ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని వెలుగు ఏపీఎం రెడ్డి రామకృష్ణం నాయుడు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో ఓటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీ రవికుమార్‌, గ్రామ సంఘ సభ్యులు, మండల సమైక్య సభ్యులు, సీసీలు, వీవోఏలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 12:12 AM