Share News

ఈవీఎంలు వచ్చేశాయి..

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:18 AM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరిగే పోలింగ్‌ కోసం అవసరమైన ఈవీఎంలు, ఈవీప్యాట్‌లు బుధవారం రాత్రి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు చేరుకున్నాయి. వీటిని సంబంధిత అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరించారు. పలాస నియోజకవర్గంలో 284 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలకు 684 ఈవీఎంలు వచ్చినట్లు పలాస ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భరత్‌నాయక్‌ తెలిపారు. వాటిని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన పార్టీల నాయకుల సమక్షంలో పలాస జూనియర్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం లను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆర్వో బి.సుదర్శన్‌ దొర, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ సోంపేట జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. మొత్తం 299 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి 38బాక్సుల్లో ఈవీప్యాట్‌లు, ఈవీఎంలు చేరుకున్నాయి.

ఈవీఎంలు వచ్చేశాయి..
సోంపేటలో ఈవీఎం బాక్సులను దించుతున్న దృశ్యం

పలాసరూరల్‌/సోంపేట, ఏప్రిల్‌ 17: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13వ తేదీన జరిగే పోలింగ్‌ కోసం అవసరమైన ఈవీఎంలు, ఈవీప్యాట్‌లు బుధవారం రాత్రి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలకు చేరుకున్నాయి. వీటిని సంబంధిత అధికారులు స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపరించారు. పలాస నియోజకవర్గంలో 284 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలకు 684 ఈవీఎంలు వచ్చినట్లు పలాస ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి భరత్‌నాయక్‌ తెలిపారు. వాటిని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, జనసేన పార్టీల నాయకుల సమక్షంలో పలాస జూనియర్‌ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం లను రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఆర్వో బి.సుదర్శన్‌ దొర, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ సోంపేట జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. మొత్తం 299 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి 38బాక్సుల్లో ఈవీప్యాట్‌లు, ఈవీఎంలు చేరుకున్నాయి.

Updated Date - Apr 18 , 2024 | 12:18 AM