Share News

డ్రైనేజీని ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Oct 15 , 2024 | 12:13 AM

3

 డ్రైనేజీని ఏర్పాటు చేయండి
జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మురుగునీరు ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు :

టెక్కలి, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రాసుపత్రి వద్ద మురుగునీరు వెళ్లేందుకు అవసరమైన డ్రైనేజీని ఏర్పాటుచేయాలని ఏపీఎస్‌ఐడీసీ అధికారులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించా రు. సోమవారం టెక్కలి జిల్లా కేంద్రాసుపత్రిని సందర్శించారు. రోడ్లపై మురుగునీరు రావడంతోపాటు పాకుదేరి ఉండడంతో అసహనం వ్యక్తంచేశారు. మురుగునీరు సరిచేసే బాధ్యత లేదా అని అధికారు లకు ప్రశ్నించారు. తొలుత ఆసుపత్రిలో రోగులు కూర్చొనేందుకు ఏర్పాటుచేసిన కుర్చీలను పరిశీలించా రు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా వైద్యులు కృషి చేయాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూర్యారావుకు కోరారు. అత్యవసర వార్డులో ఉన్న రోగులతో వైద్యసేవలపై ఆరాతీశారు.ఆయనతోపాటు ఆర్డీవో కృష్ణమూర్తి, కింజరాపు హరివరప్రసాద్‌, బగాది శేషగిరి, లక్ష్మణరావు, బాలకృష్ణ ఉన్నారు.

Updated Date - Oct 15 , 2024 | 12:13 AM