Share News

వ్యాసరచన, జానపద కథల పోటీలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:25 PM

పలాస మండలం రంగోయి గ్రామానికి చెందిన గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం, బద్రి అప్పన్న స్మారక పీఠం 20 వసంతాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, జానపద కథల పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘ వ్యవస్థాపక అధ్య క్షుడు బద్రి కూర్మారావు ఒక ప్రకటనలో తెలిపారు.

వ్యాసరచన, జానపద కథల పోటీలు

పలాసరూరల్‌: పలాస మండలం రంగోయి గ్రామానికి చెందిన గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం, బద్రి అప్పన్న స్మారక పీఠం 20 వసంతాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, జానపద కథల పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘ వ్యవస్థాపక అధ్య క్షుడు బద్రి కూర్మారావు ఒక ప్రకటనలో తెలిపారు. 3, 4, 5 తరగతులకు తెలుగు పద్యపఠనం- భావాలతో అప్పగించడం, 6, 7 తర గతులకు తెలుగుభాష తీయదనం, 8, 9, 10 తరగతులకు తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జానపద కళల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరాలకు ఈ నెల 6వతేదీలోగా 97011 51207, 77028 38118, 97045 70597 నెంబర్లకు పోటీ చేసే వారి వివరాలను పంపాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Updated Date - Jan 03 , 2024 | 11:26 PM