Share News

ఎస్మా ప్రయోగం.. అప్రజాస్వామికం

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:18 PM

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగి స్తూనే ఉన్నారు. శనివారం కలెక్టరేట్‌ వద్ద జ్యోతిబాపూలే పార్కు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో 24 గం టల రిలే నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ పూలమా లలు వేసి దీక్షలను ప్రారంభించారు.

ఎస్మా ప్రయోగం.. అప్రజాస్వామికం
రిలే నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలు

- డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె విరమించేది లేదు: అంగన్‌వాడీ కార్యకర్తలు

కలెక్టరేట్‌, జనవరి 6: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మె కొనసాగి స్తూనే ఉన్నారు. శనివారం కలెక్టరేట్‌ వద్ద జ్యోతిబాపూలే పార్కు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో 24 గం టల రిలే నిరవధిక నిరాహార దీక్ష నిర్వహించారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ పూలమా లలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలపై ప్రభు త్వం ఎస్మాను ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. గౌరవ వేతనం తమ కొద్దు అని.. కనీస వేతనాలు అందజేయాలని నినాదాలు చేశారు. నిర్బంధాలకు భయపడబోమని, డిమాండ్లు పరిష్కరించేవరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టు తీర్పును కూడా అమలుచేయపోవడంతో శోచనీయమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని, అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కె. కళ్యాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు మాట్లా డుతూ.. ఎస్మా ప్రయోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమ్మె కార్మికుల హక్కు అని.. చట్టప్రకారం 15 రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందజేశామని తెలిపారు. ప్రభుత్వ విధానం మారకపోతే ఆమరణ దీక్షకైనా అంగన్‌వాడీలు వెనుకాడబోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎమ్‌కె పద్మజ, జి.గిరిజ, నీలవేణి, కె.లక్ష్మీనారాయణ, లక్ష్మి, ఎస్‌.రుక్మిణి, కమలమ్మ, జె.పార్వతి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 11:18 PM