Share News

ఎలక్టోరల్‌లో తప్పిదాలకు.. ఈఆర్వోలదే బాధ్యత

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:03 AM

ఎలక్టోరల్‌ నమోదు, తొలగింపుల్లో ఎటువంటి తప్పిదాలు లేకుండా ఈఆర్వోలు బాధ్యత వహించాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఎలక్టోరల్‌లో తప్పిదాలకు.. ఈఆర్వోలదే బాధ్యత
మాట్లాడుతున్న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 2: ఎలక్టోరల్‌ నమోదు, తొలగింపుల్లో ఎటువంటి తప్పిదాలు లేకుండా ఈఆర్వోలు బాధ్యత వహించాలని కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో సాధారణ ఎన్నికల సన్నద్ధతపై జేసీ ఎం.నవీన్‌, ఎస్పీ జీఆర్‌ రాధికతో కలిసి ఎలక్టోరల్‌, నోడల్‌, జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఎన్నికల విధులపై అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావు లేదని స్పష్టం చేశారు. జేసీ ఎం.నవీన్‌ మాట్లాడుతూ పెండింగులో ఉన్న ఫారం-6, తదితర వాటిపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న దరాఖాస్తులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఎలక్టోరల్‌పై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు. బీఎల్‌వోలకు డెత్‌ కేసులపై అవగాహన ఉంటుందని, వాటిని ఆధారాలతో సహా జాగ్రత్తగా పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. తప్పుడు డోర్‌ నెంబర్లు, ఫారం ప్రకారం డేటాను అందజేయాలన్నారు. నకిలీ, తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై ఏపీసీని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్పీ రాధిక జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులపై కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, డీఆర్వో ఎం.గణపతిరావు, ఆర్డీవోలు ఎస్‌.భరత్‌నాయక్‌, సీహెచ్‌ రంగయ్య, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, నోడల్‌ అధికారులు, డీపీవో రవికుమార్‌, జడ్పీ సీఈవో వెంకటరామన్‌, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్‌, డీఈవో వేంకటేశ్వరరావు, ఏపీసీ జయప్రకాష్‌, సీపీవో లక్ష్మీప్రసన్న, హౌసింగ్‌ పీడీ గణపతిరావు, ఐసీడీఎస్‌ పీడీ శాంతిశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 12:03 AM