Share News

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:12 PM

పచ్చదనం తోనే పర్యావరణ పరిర క్షణ సాధ్యమని, అందు వల్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

పచ్చదనంతో పర్యావరణ పరిరక్షణ
పాతపట్నం: ఆర్‌ఎల్‌పురం పెద్దచెరువుగట్టుపై మొక్క నాటుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

ఎమ్మెల్యే ఎంజీఆర్‌

పాతపట్నం/ హిరమండలం/ ఎల్‌ఎన్‌పేట/ మెళియాపుట్టి/ కొత్తూరు: పచ్చదనం తోనే పర్యావరణ పరిర క్షణ సాధ్యమని, అందు వల్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా సోమవారం పాతపట్నం, హిరమం డలం, ఎల్‌ఎన్‌పేట, మెళి యాపుట్టి, కొత్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యతకు, మానవాళి మనుగడకు మొక్కలు నాటడం అత్య వసరమన్నారు. నియోజక వర్గంలోని అన్ని మండాలాల్లో వేతనదారులకు వివిధ రకాల మొక్కలను అందిస్తామని, వాటిని నాటి పరిరక్షించాలని కోరారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు, సర్పంచ్‌లు అంపోలు శ్రీదేవి, లంక రోజారాణి, రవ్వల అనురాధ గణ పతిరావు, అప్పారావు, లోతుగెడ్డ భగవాన్‌ దాసునాయుడు, ఎంపీటీసీ చింతాడ బుడ్డు, మాజీ ఎంపీపీ సలాన మోహనరావు, టీడీపీ నేతలు మధు, మడ్డు రామారావు, టి.తిరుపతిరావు, జి.కామేశ్వరరావు, సాయికృష్ణ పట్నాయక్‌, ఎం.మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి, నాయకులు కె.కృష్ణమాచారి, వి.గోవింద రావు, బాస్కర్‌గౌడో, బి.పరమేష్‌రెడ్డి, చింతాడ కోటేశ్వరరావు, ఎద్దు దాసునాయుడు, ఎంపీడీవోలు స్వరూపరాణి, త్రివిక్రమరావు, ఏపీవోలు శ్రీదేవి, ఎ.సురేష్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

బొర్రంపేట(ఎల్‌.ఎన్‌.పేట): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా నని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం ఉపాధి పనుల్లో భాగంగా మొక్క లు నాటిన ఆయనను పలువురు గ్రామస్థులు కలిసి వినతిపత్రాలు అందించారు. సిద్దాంతం రోడ్డు జంక్షన్‌ నుంచి మల్లి కార్జున పురం వరకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని స్థానికులు ఎస్‌.రామచంద్రరావు, జి.రామశంకర్‌, కె.సింహాచలం, బి.హరి, ఎస్‌.మల్లేశ్వరరావు తదితరులు వినతిపత్రం అందించారు. సంబంధిత విద్యుత్‌ శాఖాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్క రించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 11:12 PM