Share News

హైవే ఫుట్‌పాత్‌ ఆక్రమణ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:17 AM

రూరల్‌ మండలం మునస బుపేట సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్డు ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురవు తోంది. ఈ ఫుట్‌పాత్‌పై ఓ కంపెనీ కంటైనర్లను ఏ ర్పాటు చేసి నివాసయోగ్యంగా మార్చేశారు.

హైవే ఫుట్‌పాత్‌ ఆక్రమణ
ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన కంటైనర్లు

శ్రీకాకుళం క్రైం: రూరల్‌ మండలం మునస బుపేట సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు రోడ్డు ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురవు తోంది. ఈ ఫుట్‌పాత్‌పై ఓ కంపెనీ కంటైనర్లను ఏ ర్పాటు చేసి నివాసయోగ్యంగా మార్చేశారు. సుమా రు 30 మంది ప్రతిరోజూ ఈ కంటైనర్లలో ఉంటూ ఓ వివాదస్పద స్థలానికి కాపలా కాస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయం తమ దృష్టికి రాలేదని జాతీయ రహదారి భద్రతా అధికారులు చెబుతున్నారు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌ ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:17 AM