Share News

ఉద్యోగుల నిరసన

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:32 PM

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అణిచివేతలపై గురువారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

  ఉద్యోగుల నిరసన
మెళియాపుట్టిలో ఆందోళన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

టెక్కలి, ఫిబ్రవరి 15: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం, అణిచివేతలపై గురువారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఏపీజేఏసీ ప్రతినిధులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భవిష్యత్‌ పోరాటానికి సిద్ధంగా ఉండాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గున్న ప్రసాదరావుతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

నరసన్నపేట: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించా లని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. గురువారం సత్యవరం ఉన్నత పాఠశాల, తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ, ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. డీఏ, మెడికల్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని... ఉపాధ్యాయులపై ఉన్నతాధికారుల వేధింపులు నిలిపివేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించాలి

మెళియాపుట్టి: తమ సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ గురువారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రావలసిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీ శంకర్‌, ఉద్యోగ సంఘ నాయకులు శ్రవణ్‌, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:32 PM