Share News

YCP dharna: వారు ముఖం చాటేశారు

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:39 PM

ycp Leaders' absence విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు నాయకత్వం కొరవడింది. విద్యుత్‌ చార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిల నాయకత్వంలో ధర్నాలు చేపట్టాలని వైసీపీ అధిష్ఠానం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

YCP dharna: వారు ముఖం చాటేశారు
విద్యుత్‌ కార్యాలయంలో ఎస్‌ఈకి వినతిపత్రం అందజేస్తున్న వైసీపీ నాయకులు

  • విద్యుత్‌ ధర్నాకు ముఖ్య నేతల గైర్హాజరు

    శ్రీకాకుళంఅర్బన్‌, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన పోరుబాటకు నాయకత్వం కొరవడింది. విద్యుత్‌ చార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జిల నాయకత్వంలో ధర్నాలు చేపట్టాలని వైసీపీ అధిష్ఠానం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఈ కార్యక్రమానికి కూడా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ ముఖం చాటేశారు. మిగిలిన చోట్ల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జడ్పీ చైర్‌పర్సన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావుతోపాటు ఆయన కుమారుడు రామ్‌మనోహర్‌ నాయుడు కూడా హాజరు కాలేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడంతో.. జిల్లాకేంద్రంలో నాయకత్వం కొరవడిందనే విమర్శలు వినిపించాయి. నగర అధ్యక్షుడు, మండలస్థాయి నాయకులు శుక్రవారం సూర్యహమహల్‌ కూడలి నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ఎస్‌ఈకి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Dec 27 , 2024 | 11:39 PM