Share News

విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:36 PM

విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఆ సంఘ నాయకుడు ఎల్‌.రామకృష్ణ అన్నారు. బుధవారం టెక్కలి డివిజన్‌ పరిధి విద్యుత్‌ మీటర్‌ రీడర్లతో సమావేశం నిరహించారు.

విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి

టెక్కలి: విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న మీటర్‌ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఆ సంఘ నాయకుడు ఎల్‌.రామకృష్ణ అన్నారు. బుధవారం టెక్కలి డివిజన్‌ పరిధి విద్యుత్‌ మీటర్‌ రీడర్లతో సమావేశం నిరహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీకల్లా బిల్లింగ్‌ చేసేలా మీటర్‌ రీడర్లపై కాంట్రా క్టర్లు ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. స్మార్ట్‌ మీటర్లు రావడంతో మీటరు రీడర్లు ఉపాధి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాని మోదీ కార్పొరేటర్లకు అప్పగించేందుకు విద్యుత్‌ సవరణ చట్ట తీసుకువచ్చారని విమర్శించారు. విద్యుత్‌ మీటర్‌ రీడర్లకు ప్రత్యామ్నాయ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.శివారెడ్డి, నేతలు క్రాంతికుమార్‌, ఆర్‌.కుమా రస్వామి, వి.ప్రసాద్‌, పి.శ్రీనివాసరావు, అప్పలనాయుడు, తులసీదాస్‌, కృష్ణ, శంకర్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:36 PM