Share News

గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

ABN , Publish Date - May 12 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేటా యించిన గ్రామాలకు సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. మం డలంలోని 45 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకు న్నారు.

గ్రామాలకు చేరుకున్న ఎన్నికల సిబ్బంది

సరుబుజ్జిలి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేటా యించిన గ్రామాలకు సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. మం డలంలోని 45 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఎటు వంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకు న్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా షామియానాలు, తాగునీటి ఏర్పాట్లు చేశారు. మండలంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రత లకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలను కేటాయించారు. 21 గ్రామ పంచాయతీలకు చెందిన 28,097 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారు.

నందిగాం: మండలంలో శాసనసభ, పార్లమెంట్‌ ఎన్ని కలకు సంబంధించి పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం మండలంలోని 88 పోలింగ్‌ కేంద్రాల్లో 50,292 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దీనికి గాను పోలిం గ్‌ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. మండల కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అధికారి జి.శివప్రసాద్‌, సెక్టార్‌ అధికారులు, రెవెన్యూ ఉద్యోగులు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

జలుమూరు: ఎన్నికల పోలింగు సోమవారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసినట్లు తహసీల్దారు సీహెచ్‌.నాగమ్మ తెలిపారు. మండలంలో 50,990 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 73 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు 9 రూట్లుగా విభజించి 365 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ విధించినట్లు ఆమె తెలిపారు.

హిరమండలం: మండలంలో ఎన్నికల పోలింగ్‌కు 45 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం పాతపట్నంలో అందజేసిన పోలింగ్‌ సామగ్రితో సహా ఎన్నికల సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. 32,668 మంది ఓటర్లు ఉన్నారు. 60 పోలీస్‌ సిబ్బంది, ఇద్దరు ఎస్‌ఐలు, 10 మంది స్పెషల్‌ ఫోర్స్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సదుపాయం కల్పించారు.

Updated Date - May 12 , 2024 | 11:55 PM