Share News

అరచేతిలో ఎన్నికల సమాచారం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:38 AM

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పూర్తిస్థాయి సమాచారం, సాంకేతిక సహకారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు చేసేందుకు, ఓటర్లకు ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌లు, పోర్టల్‌, వెబ్‌సైట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌లను వినియోగించుకొనేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. తప్పు చేసిన వారికి క్షణాల్లో శిక్ష అమలయ్యేలా యాప్‌లను ఈసీ రూపొందించింది.

అరచేతిలో  ఎన్నికల సమాచారం

(నరసన్నపేట)

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పూర్తిస్థాయి సమాచారం, సాంకేతిక సహకారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఫిర్యాదులు చేసేందుకు, ఓటర్లకు ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌లు, పోర్టల్‌, వెబ్‌సైట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌లను వినియోగించుకొనేందుకు వీలుగా అందుబాటులోకి తీసుకువచ్చారు. తప్పు చేసిన వారికి క్షణాల్లో శిక్ష అమలయ్యేలా యాప్‌లను ఈసీ రూపొందించింది.

ఓటరు సాయానికి ‘వీహెచ్‌ఎస్‌’

ఓటర్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలుగా ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ (వీహెచ్‌ఏ) పేరిట ప్రత్యేక వ్యవస్థను ఎన్నికల సంఘం రూపొందించింది. ఇందులో ఓటు నమోదు చేసు కునేందుకు వీలుగా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా? అన్నది సులువుగా తెలుసుకోవచ్చు. ఎపిక్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫిర్యాదులకు ప్రత్యేకం

‘ఎన్జీఎస్‌’

ఓటర్లు ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు నేషనల్‌ గ్రీవెన్స్‌ సర్వీసెస్‌ (ఎన్జీఎస్‌) పేరిట ఒక పోర్టల్‌ ఉంది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులను ఇందులో నమోదు చేయవచ్చు. దేశ వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి చెందిన ఫిర్యాదులైనా ఇందులో నమోదు చేయవచ్చు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ వివరాలను పొందుపరిస్తే సంబంధిత నియోజకవర్గ అధికారులు వీటిని పరిశీలించి చర్యలు చేపడతారు.

అభ్యర్ధి గురించి తెలుసుకోండిలా..

మీ అభ్యర్ధి గురించి తెలుసుకునేందుకు నో యువర్‌ క్యాండిడేట్‌ (కేవైసీ) పేరిట ఒక వెబ్‌సైట్‌ ఉంది. అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసే ప్రమాణపత్రాలు (అఫిడవిట్లు) ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఎన్నికల సంఘం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. పోటీలో ఉన్న అభ్యర్థి ఎటువంటి వారు, వారికి నేర చరిత్ర ఏమైనా ఉందా, వారికి ఏఏ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్థిర, చరాస్తుల వివరాలు, బంగారు ఆభరణాల వివరాలను తెలుసుకోవచ్చు.

‘సి-విజిల్‌’తో అక్రమాలకు చెక్‌

ఎన్నికల్లో ప్రలోభాలు, అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన యాప్‌ ఇది. ప్రజలు తాము గుర్తించిన అక్రమాలను సి-విజిల్‌ యాప్‌లో సంక్షిప్తంగా నమోదుచేయాలి. వంద నిమిషాల వ్యవధిలో అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటారు. తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో తెలుపుతారు. సమా చారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం ఈయాప్‌ ప్రత్యేకత.

దివ్యాంగుల చేయూతకు ‘సాక్ష్యం’...

వయోవృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం సాక్ష్యం యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్‌ కేంద్రానికి సొంతంగా రాలేని వారు ఇందులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వారిని పోలింగ్‌ కేంద్రానికి తీసుకు వచ్చేందుకు అధికారులు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీని సమకూర్చుతారు.

Updated Date - Apr 25 , 2024 | 12:38 AM