Share News

సామాజిక అంతరాలను తొలగించేది విద్య

ABN , Publish Date - Nov 25 , 2024 | 11:30 PM

హరిపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో సామాజిక అంతరాలు తొలగించి జ్ఞానం ఇచ్చేది విద్య మాత్రమేనని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు అన్నారు.

 సామాజిక అంతరాలను తొలగించేది విద్య
సాంస్కృతిక పోటీల్లో విజేత షన్ముఖకు బహుమతి అందజేస్తున్న యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

హరిపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో సామాజిక అంతరాలు తొలగించి జ్ఞానం ఇచ్చేది విద్య మాత్రమేనని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు అన్నారు. హరిపురం హైస్కూల్‌ ఆవరణలో యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాల మహాసభలు రెండోరోజు సోమవారం నిర్వహించారు. ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఓపీఎస్‌ పుననరుద్ధరణ, 117 రద్దు, కామన్‌ సర్వీసు రూల్స్‌ రూపొందించి సమస్యలను పరిష్కరించి పదోన్నతులకు మార్గం సుగుమం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యూటీఎఫ్‌ మండల కార్యవర్గాలను ఎన్నుకున్నారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్ర మంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మురళీమోహన్‌, కిషోర్‌కుమార్‌, ప్రతినిధులు కోందడరావు, జగదీష్‌, ఎల్వీ చలం, జయరాం, మాధవరావు, రమేష్‌, ధనలక్ష్మి, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

షణ్ముఖ మాస్టార్‌కు బహుమతులు

కోటబొమ్మాళి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాల సంద ర్భంగా ఉపాధ్యాయులకు నిర్వహించిన సాంస్కృతిక విభాగం పోటీల్లో కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు షణ్ముఖ మాస్టార్‌ నాటికలు, అభ్యు దయ గీతాలు, మిమిక్రీలో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో సోమవారం మందస మండలం హరిపురంలో జరిగిన యూటీఎఫ్‌ స్వర్ణోత్సవాల్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు బహుమతులు అందించి అభినందించారు.

Updated Date - Nov 25 , 2024 | 11:30 PM