Share News

పశుపోషణతో ఆర్థిక పురోగతి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:51 PM

గ్రామీణ భారత దేశంలో పశువుల పెంపకం కీలకమైన ఆర్థిక వనరని, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని శ్రీకాకు ళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

పశుపోషణతో ఆర్థిక పురోగతి
రణస్థలం: పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

శ్రీకాకుళం రూరల్‌, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రామీణ భారత దేశంలో పశువుల పెంపకం కీలకమైన ఆర్థిక వనరని, ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని శ్రీకాకు ళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. కిష్టప్పపేటలో పశుగణన పోస్టర్‌ను ఎమ్మెల్యే శంకర్‌ శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు పశుపోషణ అదనపు ఆదాయాన్ని అందిస్తుందన్నారు. భూమిలేని కుటుంబాలకు ప్రాఽథ మిక జీవనోపాధిగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభ సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన ఆదాయవనరుగా ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా అక్టోబరు 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశుగణన చేపట్టనుందన్నారు. ఈ పశుగణన భవిష్యత్‌ ప్రణాళిక, విధాన రూపకల్పనకు కీలకమైన సమాచారం అందిస్తుందన్నారు. పశుగణన ప్రతీ ఐదేళ్లకోసారి నిర్వహిస్తున్నట్టు తెలిపారు. స్థానిక సహాయ సంచాలకులు పీఎస్‌జీ బాలకృష్ణ, సహా య సంచాలకులు, వీసీపీ వైవీ కృష్ణారావు, పశు వైధ్యాధికారులు తిరుపతిరావు, దిలీప్‌, జ్యోస్న తదితరులు పాల్గొన్నారు.

పశుగణనకు సహకరించాలి

ఆమదాలవలస, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అఖిల భారత ప శుగణనకు ప్రజలందరూ సహకరించాలని పశువైద్య సహాయ సం చాలకులు రోణంకి ఆనందరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌, టీడీపీ నాయకులతో కలిసి పశుగణన పోస్టర్లను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని రెవె న్యూ గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సమాచారం సేకరిస్తామన్నారు. కార్య క్రమంలో మున్సిపల్‌ కమి షనర్‌ పూజారి బాలాజీ ప్రసాద్‌, టీడీపీ లీగల్‌ సె ల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌, పీవీవీకే రాజు, మున్సిపల్‌ కౌన్సిలర్లు నాగేశ్వరరావు, లక్ష్మణరావు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- సరుబుజ్జిలి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పశుగణన సక్ర మంగా చేపట్టాలని పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. షలంత్రి గ్రామంలో శుక్రవారం పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభి పోస్టర్‌ను ఆవిష్కరించారు కార్యక్ర మంలో ఎంపీటీసీ శివ్వాల సూర్యనారాయణ, పశువైద్యాధికారి సతీష్‌ పాల్గొన్నారు.

పశుగణన సర్వే పక్కాగా చేపట్టాలి

రణస్థలం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి) అఖిల భారత పశుగణన సర్వే పక్కాగా చేపట్టాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ ఈఆర్‌) అధికారులకు ఆదేశించారు. ఈ సర్వేకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విడుద ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుగణ సర్వే చేయించుకోవాలని, జీయో టాగింగ్‌ ఇంటి వద్దే చేపడతారన్నారు. ఈ సర్వే వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు జరగ నున్నదని స్పష్టం చేశారు. ఏడీ దుర్గారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:51 PM