డ్వాక్రా మహిళలకు దువ్వాడ తాయిళాలు
ABN , Publish Date - Mar 08 , 2024 | 11:58 PM
మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్వాక్రా మహిళలకు తాయిళాల రూపంలో చీరలు పంపిణీ చేశారు.
టెక్కలి, మార్చి 8 : మహిళా దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్వాక్రా మహిళలకు తాయిళాల రూపంలో చీరలు పంపిణీ చేశారు. శుక్రవారం టెక్కలిలోని తన కార్యాలయంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధుల సన్మానం పేరిట పనిలో పనిగా 500మంది డ్వాక్రా మహిళలను పిలిచారు. కవరుపైన ‘జై జగన్.. జై దువ్వాడ, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు’ అంటూ ఓ స్టిక్కర్ అతికించి వారికి చీరలు అందజేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీకి సహకరించాలని కోరడం చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేడాడ తిలక్, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు, నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామ్మూర్తి, టెక్కలి సర్పంచ్ గొండేల సుజాత, కోత ఇందిర, రాజేశ్వరి ఉన్నారు.