Share News

ఎన్నికల ప్రచారంలో తప్పెటగుళ్లు ఉండాల్సిందే..

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:34 AM

ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తప్పెటగుళ్ల సందడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తప్పెటగుళ్లతో కళాకారులు ఆడిపాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ముందుగా నిర్వహించే నామినేషన్ల పర్వంలోనే ఎక్కువ సందడి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎంత బాగా జనసమీకరణ చేస్తే, అంతకంటే జోరుగా ప్రచారం సాగుతుందని రాజకీయ పార్టీల విశ్వాసం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ముఖ్య నేత వచ్చినా స్వాగతం పలికేందుకు తప్పెటగుళ్లు కళాకారులు ముందుంటారు. జిల్లాలో ఎస్‌ఎంపురం, పెద్దపాడు, ముద్దాడ, అల్లినగరం, బుడుమూరు, బావాజీపేట, జొన్నలపాడు తదితర గ్రామాల్లో సుమారు 1200 మంది తప్పెటగుళ్ల కళాకారులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌ఎంపురం కళాకా రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు.

ఎన్నికల ప్రచారంలో   తప్పెటగుళ్లు  ఉండాల్సిందే..

రణస్థలం: ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో తప్పెటగుళ్ల సందడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా తప్పెటగుళ్లతో కళాకారులు ఆడిపాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో ముందుగా నిర్వహించే నామినేషన్ల పర్వంలోనే ఎక్కువ సందడి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎంత బాగా జనసమీకరణ చేస్తే, అంతకంటే జోరుగా ప్రచారం సాగుతుందని రాజకీయ పార్టీల విశ్వాసం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ ముఖ్య నేత వచ్చినా స్వాగతం పలికేందుకు తప్పెటగుళ్లు కళాకారులు ముందుంటారు. జిల్లాలో ఎస్‌ఎంపురం, పెద్దపాడు, ముద్దాడ, అల్లినగరం, బుడుమూరు, బావాజీపేట, జొన్నలపాడు తదితర గ్రామాల్లో సుమారు 1200 మంది తప్పెటగుళ్ల కళాకారులు ఉన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌ఎంపురం కళాకా రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:34 AM