Share News

జగన్‌ అసమర్థతతో ఆర్థిక స్థితి అతలాకుతలం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:17 AM

రాష్ట్రంలో ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ అసమర్థపాలనతో ఆర్థిక స్థితి అతలాకుతలమైందని ఎంపీ కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు, ఆమదాలవలస, శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థులు కూన రవికుమార్‌, గొండు శంకర్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి మూడో వార్డు ఊసవానిపేటలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.

జగన్‌ అసమర్థతతో ఆర్థిక స్థితి అతలాకుతలం
ఆమదాలవలస: సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రామ్మోహన్‌

ఆమదాలవలస: రాష్ట్రంలో ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్‌ అసమర్థపాలనతో ఆర్థిక స్థితి అతలాకుతలమైందని ఎంపీ కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు, ఆమదాలవలస, శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థులు కూన రవికుమార్‌, గొండు శంకర్‌ అన్నారు. మున్సిపాలిటీ పరిధి మూడో వార్డు ఊసవానిపేటలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. టీడీపీ హయాంలో ఆమదాలవలస మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో మౌలిక సదుపా యాలు కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు ఇంజరాపు విశ్వనాథం, మెండ దాసునాయుడు, సుజాత, చంద్రశేఖర్‌, గీతాసాగర్‌ తదిత రులు పాల్గొన్నారు. 15, 13 వార్డుల్లోని గణేష్‌నగర్‌, విద్యానగర్‌ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. కూటమి నాయకులు సూరపు నాయుడు, తమ్మినేని గీత, తమ్మినేని విద్యాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

కూటమి అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే అశోక్‌

సోంపేట: రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, జనసేన ఇన్‌చార్జి దాసరి రాజు కోరారు. సోంపేట పట్టణంలోని చిన్నపొందరవీధి, దగ్గుచెరువు గట్టువీధి, మహాదేవి పేట, కొండివీధి, మంగళవీధుల్లో శుక్రవారం సూపర్‌సిక్స్‌ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దిల నాగేశ్వరరావు, నేతలు సూరాడ చంద్రమోహన్‌, చిత్రాడ శ్రీను, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే పాలనలో ప్రజాసంక్షేమం: శంకర్‌

శ్రీకాకుళం రూరల్‌: దేశం లో ఎన్డీయే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలోనే ప్రజా సంక్షేమం సాధ్యపడుతుందని శ్రీకాకుళం కూటమి టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ అన్నారు. పెద్దగనగళ్లవానిపేటలో శుక్రవారం సర్పంచ్‌ బర్రి రామారావు ఆధ్వర్యంలో ప్రజాగళం, సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం నిర్వ హించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా రామ్మోహన్‌ నాయు డును గెలిపించాలని కోరారు. టీడీపీని గెలిపిస్తే మత్స్యకారుల ఆర్ధిక సామాజిక ఎదుగుదలకు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు, పీస రమణ, మైలపిల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభకు కలిశెట్టి పాదాభివందనం

రణస్థలం: ‘అమ్మా నన్ను ఆశీర్వదిం చండి.. నా ఈ ఉన్నతికి మీరే కారణం’.. అం టూ విజయనగరం పార్లమెంటరీ టీడీపీ అభ్య ర్థి కలిశెట్టి అప్పల నాయుడు పొలిట్‌బ్యూరో సభ్యురాలు ప్రతిభాభారతికి పాదాభివందనం చేశారు. శుక్రవారం విజయనగరం ఎంపీ టీడీ పీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన కలిశెట్టి మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకు న్నారు. ఆమె పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన అప్పలనాయుడుకు పొం దూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా చేసిన ఘనత ఆమెదే. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన అప్పలనాయుడు ఎంపీ స్థానానికి పోటీచేసే స్థాయికి వచ్చారు. తన ఉన్నతికి కారణమైన ప్రతిభాభారతికి పాదాభివందనం చేయడం ఆనందంగా ఉందని అప్పలనాయుడు అన్నారు.

సతీమణుల ప్రచారం

ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/ గార: శ్రీకాకుళం ఎంపీ కింజ రాపు రామ్మోహన్‌ నాయుడు సతీమణి శ్రావ్య, శ్రీకాకుళం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ సతీమణి స్వాతి శుక్రవారం శ్రీకాకుళం నగరంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్‌ గుర్తు పట్టుకుని ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం చేపట్టారు. ఎన్డీఏ కూట మి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే గార మండలం రాఘవా పురం, యాల్లపేట, పూసర్లపాడు గ్రామాల్లో శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గొండు శంకర్‌ భార్య స్వాతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

వజ్రపుకొత్తూరు నుంచి 40 కుటుంబాలు టీడీపీలో చేరిక

వజ్రపుకొత్తూరు: వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని పలాస ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు పంచాయతీ నుంచి 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వారికి శిరీష పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ విధానాలతో విసుగు చెంది టీడీపీలో చేరుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు శశిభూషణ్‌, ఉమామహేశ్వరరావు, నెయ్యల సూర్యనారాయణ, కుత్తం కృష్ణ, ఇప్పిలి గోవింద్‌ పాల్గొన్నారు.

కొత్తపేట పంచాయతీ దిబ్బవానిపేటలో శుక్రవారం టీడీపీ అఽభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటిం టికీ వెళ్లి సూపర్‌ సిక్స్‌ పఽథకాలను వివ రిస్తూ తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పుచ్చ శోభారాణి, గోవిందు పాపారావు, పుచ్చ ఈశ్వర్రావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:17 AM