Share News

రైల్వేశాఖలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:05 PM

: రైల్వే శాఖలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ రైలు నిలయంలో ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌వర్మతో పాటు 30 ఎంపీలతో కూడిన కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఓబీసీలకు పార్లమెంట్‌ చట్టసభల ద్వారా లభించిన సంక్షేమ పథకాలు రైల్వే యాజమాన్యం ఉద్యోగులకు సక్ర మంగా అమలు చేయాలని ఆ సంఘ నాయకులు కమిటీని కోరారు.

 రైల్వేశాఖలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి
భువనేశ్వర్‌లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని కలిసిన రైల్వే ఓబీసీ నాయకులు

పలాస రైల్వే ఉద్యోగుల సంఘం నేతలు

పలాస, జనవరి 5: రైల్వే శాఖలో ఓబీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆ సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే భువనేశ్వర్‌ రైలు నిలయంలో ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌వర్మతో పాటు 30 ఎంపీలతో కూడిన కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఓబీసీలకు పార్లమెంట్‌ చట్టసభల ద్వారా లభించిన సంక్షేమ పథకాలు రైల్వే యాజమాన్యం ఉద్యోగులకు సక్ర మంగా అమలు చేయాలని ఆ సంఘ నాయకులు కమిటీని కోరారు. ఓబీసీ కార్మికుల పట్ల కక్షసాధింపు చర్యలు ఆపాలని, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ రైల్వే ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు పి. రాజ శేఖర్‌, అధ్యక్షుడు ఎస్‌.రామచంద్రరావు, బీకే సాహు, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌సాహు, బ్రాంచ్‌ కార్యదర్శి జీఎల్‌కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:05 PM