Share News

ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వొద్దు

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:30 AM

ఎన్నికల విధుల్లో పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు.

ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వొద్దు

- కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నియోజక వర్గ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎం.నవీన్‌ తో కలిసి కలెక్టర్‌ మాట్లాడుతూ.. మాస్టర్‌ ట్రైనర్లు ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని, నియో జకవర్గ స్థాయిలో పీవోలకు శిక్షణ ఇచ్చే సమయంలో వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది ఎంత అవగాహనతో పనిచేస్తే ఎన్నికలు అంత బాగా జరుగుతాయన్నారు. మాక్‌పోల్‌ నిర్వహ ణ, ఈవీఎం ఆపరేట్‌ చేయడం, పీవోల విధులు, బాధ్యతలు, ప్రీపోల్‌, పోలింగ్‌ తర్వాత విధులను విడమర్పి చెప్పాలని, నిబంధనలను సంపూర్ణంగా వారికి వివరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్‌ అందజేసిన ిపీపీటీ-హ్యాండ్‌ బుక్‌ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఈవీఎం మిషన్లలో బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌ అనుసంధాన ప్రక్రియ, పోలింగ్‌ డే రోజు మాక్‌పోల్‌ ప్రక్రియ, పత్రాలు నింపే విధానం గూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఈ నెల 20న మరోసారి శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్లు బి.శాంతిశ్రీ, ఎం.కిరణ్‌కుమార్‌, శేషగిరి, కె.కిరణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించా రు. జడ్పీ సీఈవో ఎం.వెంకటేశ్వరరావు, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి దాదాపు 100 మంది వరకు మాస్టర్‌ శిక్షకులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించాలి

కలెక్టరేట్‌: పోలింగ్‌ కేంద్రాలకు దివ్యంగులను తరలించడంలో గానీ, కేంద్రాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పోలింగ్‌ సందర్భంగా దివ్యాంగుల కు చేయాల్సిన ఏర్పాట్లపై ఆర్వోలతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో పీడబ్ల్యూడీ ఓట ర్లు 21,481 మంది ఉండగా, 85 ఏళ్లు దాటిన వారు 11,845 మంది ఉన్నారన్నారు. అనంతరం హోం ఓటింగ్‌కు సంబం ధించి నియోజకవర్గాల వారీగా వివరాలు అడిగి తెలుసుకు న్నారు. విభిన్న ప్రతిభావంతుల ఏడీ కవిత, జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, శ్రీకాకుళం ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య, ఆరోగశ్రీ కోఆర్డినేటర్‌ ప్రకాశరావు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ విశ్వమోహన్‌రెడ్డి, డీఈవో వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:30 AM