వైద్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:36 PM
నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో అందించే వైద్య సేవల్లో జిల్లా లోనే మంచి పేరు ఉండేదని, అయితే ప్రస్తుతం రోగుల తాకిడి ఎందుకు తగ్గిందో వైద్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు.

నరసన్నపేట, జూలై 3: నరసన్నపేట సామాజిక ఆసుపత్రిలో అందించే వైద్య సేవల్లో జిల్లా లోనే మంచి పేరు ఉండేదని, అయితే ప్రస్తుతం రోగుల తాకిడి ఎందుకు తగ్గిందో వైద్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక 100 పడ కల సామాజిక ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులను పరిశీలించి ఆసుపత్రిలో వైద్యసేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. ప్రసూతి విభాగంలో గతంలో నెలకు 350 వరకు ప్రస వాలు అయ్యేవని, ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు లేదని సూపరింటెండెంట్ డా.జయశ్రీని ప్రశ్నించారు. 20 మంది వైద్యులతో కలిపి 96 మంది సిబ్బంది ఉన్నా ఓపీ తక్కువగా ఉండడమే కాకుండా ఇతర వ్యాధులబారిన పడిన వారు ఎందుకు ఆసుపత్రికి రావడం లేదో అర్ధం కావడం లేదన్నారు. వైద్యులు అంటే తనకు ఎంతో గౌరవమని ప్రతీ ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వహించి రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో డ్యూటీ చార్ట్ ప్రకారమే కాకుండా అదనంగా పనిచేసేందుకు సిద్ధం కావాల న్నారు. రోగులకు అందించే డైట్‌ను సక్రమంగా అందించేందుకు ఏజెన్సీను మార్పు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొద్దు చిట్టిబాబు, ఎం.వెంకటప్పలనాయుడు, లుకలాపు రాంబాబు, జామి వెంకట్రావు, కింజరాపు రామా రావు, బోయన సతీష్ తదితరులు పాల్గొన్నారు.