Share News

బైండోవర్‌ అంటే తెలుసా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:03 AM

సాధారణంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా బైండోవర్‌ పదం వినిపిస్తుంది. పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేస్తారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్‌, లేదా ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. బాండ్‌ పేపర్‌పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనులు చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకొని సొంతపూచి కత్తుపై విడుదల చేస్తారు. బైండోవర్‌ను బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌ అంటారు. బైండోవర్‌ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తారు. ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్‌ కేసులను నమోదు చేస్తారు. బైండోవర్‌ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు ఆర్నెళ్లపాటు పోలీసులు వద్ద ఉంటాయి.

 బైండోవర్‌ అంటే తెలుసా?

నరసన్నపేట: సాధారణంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా బైండోవర్‌ పదం వినిపిస్తుంది. పాత నేరస్థులు, రౌడీ షీటర్లను బైండోవర్‌ చేస్తారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్‌, లేదా ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. బాండ్‌ పేపర్‌పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనులు చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకొని సొంతపూచి కత్తుపై విడుదల చేస్తారు. బైండోవర్‌ను బాండ్‌ ఫర్‌ గుడ్‌ బిహేవియర్‌ అంటారు. బైండోవర్‌ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్‌ చేస్తారు. ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండోవర్‌ కేసులను నమోదు చేస్తారు. బైండోవర్‌ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు ఆర్నెళ్లపాటు పోలీసులు వద్ద ఉంటాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:03 AM