Share News

మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా?

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:40 PM

జిల్లాలో వివిధ పాఠశాలలు, వసతి గృహాలను సివిల్‌ న్యాయాధికారులు శనివారం సందర్శించారు.

మీ ఇంటిని ఇలాగే ఉంచుతారా?

నరసన్నపేట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పాఠశాలలు, వసతి గృహాలను సివిల్‌ న్యాయాధికారులు శనివారం సందర్శించారు. స్థానిక కళాశాలల బాలికల ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహాన్ని శనివారం స్థానిక సివిల్‌ కోర్టు న్యాయాధికారి సీహెచ్‌ హరి ప్రియ సందర్శించారు. ఇరుకు గదుల్లో విద్యార్థినులుండడం, బాత్‌ రూంలు, మరుగుదొడ్ల నిర్వ హణ దారుణంగా ఉండడంతో ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. మీ ఇల్లు అయితే ఇలాగే ఉంచు తారా అంటూ హెచ్‌డబ్ల్యూవో పి.శ్రీలక్ష్మిని ప్రశ్నించారు. అద్దె భవనం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హెచ్‌డబ్ల్యూవో తెలిపారు. భోజనం రుచిగా ఉండడం లేదని, తెల్లవారుజామున చేసిన వంటకాలను పెడుతున్నారని విద్యార్థినులు న్యాయాధికారి దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం తగుచర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో బార్‌ అసియేషన్‌ సభ్యుడు జీవీజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయాధికారి స్థానిక సబ్‌ జైలును పరిశీలించారు.
వసతి గృహాల్లో వసతులపై ఆరా
టెక్కలి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
స్థానిక గిరిజన కళాశాల బాలుర, పోలవరం బీసీ బాలుర, భీంపురం బాలికల వసతిగృహాలను శనివారం సీనియర్‌ సివిల్‌ న్యా యాధికారి జె.శ్రీనివాసరావు సందర్శించారు. వసతి గృహాల్లో పరిశుభ్రతపై సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. విద్యార్థుల వస తులు, వారి ఆహార పద్ధతులు, విద్య, వైద్యం, మెనూలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌డబ్య్లూవోలను ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కోటబొమ్మాళి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పరిరక్షించాలని స్థానిక జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బీఎంఆర్‌ ప్రసన్నలత తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం కోర్టు ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటారు. కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
మెనూ సక్రమంగా అమలు చేయాలి
పాతపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
ఆశ్రమ పాఠశాలలో మెనూను సక్రమంగా అమలు చేయాలని జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మన్యం రోహిణి అన్నారు. లాబర గిరిజన బాలుర, బొమ్మాక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. స్టాక్‌ రికార్డులను పరిశీలించారు.
బీసీ బాలికల వసతి గృహం తనిఖీ
మందస, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
మందస ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని సోంపేట అడిషనల్‌ జ్యుడీషియల్‌ న్యాయాధికారి కె.కిషోర్‌బాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేప ట్టారు. బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెనూతో పాటు పరిసరాలను పరి శీలించి హెచ్‌డబ్ల్యూవో కృష్ణవేణికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట మందస ఎస్‌ఐ ఖాదర్‌ భాషా ఉన్నారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
హిరమండలం/ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):
విద్యార్థినుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమదాలవలస జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎస్‌.మణి ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఎల్‌ఎన్‌పేట, హిరమండలం లోని కేజీబీవీలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల స్థితిగతులు, బాలికలకు అందిస్తున్న వివిధ సేవలపై ఆరా తీశారు. తరగతి, వంట గదులను పరిశీలించా రు.ఆమెతో పాటు ఎంఈవో చంద్రమౌళి, పాఠశాలల ప్రత్యేకాధికారులు ఎం. వెంకట అంబిక, కృష్ణవేణి తదితరులున్నారు.
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందివ్వాలి
సోంపేట, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పఽథకం ద్వారా విద్యార్థులకు రుచికరమైన భోజనం అందివ్వాలని సోంపేట ఆరో అడిషినల్‌ జిల్లా న్యాయాధికారి కె.కిషోర్‌బాబు కోరారు. శనివారం మండలంలోని రాజాం కేజీబీవీ పాఠశాలలో రికార్డులు, మధ్యాహ్న భోజన పఽథకాన్ని పరిశీలించారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పొందూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
విద్యార్థి దశలోనే చట్టాలపై అవ గాహన కలిగి ఉండాలని పొందూరు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి. జ్యోత్స్న తెలిపారు. శనివారం వావిలపల్లి పేట మోడల్‌స్కూల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. కాగా రాపాక కూడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను, బాలుర వసతిగృహాన్ని కూడా ఆమె పరిశీలించారు.

Updated Date - Oct 19 , 2024 | 11:40 PM