మెనూ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దు
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:13 PM
విద్యార్థులకు అందించే మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు.

పాతపట్నం/మెళియాపుట్టి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందించే మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు అన్నారు. పాతపట్నం మండలం బైదలాపురం, మెళియాపుట్టి మండ లం బందపల్లి, పీఎల్‌పురం ఆశ్రమ పాఠశాలలను శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలు, ఆహార పదార్థాల తయారీ, వంటగదులు, స్టాక్ గదులను పరిశీలించారు. తరగతులను పరిశీలించి విద్యార్థులతో మా ట్లాడారు. సమయం వృథా చేయకుండా చదువుకుని పాఠ శాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. మెళియాపుట్టిలో నిర్మా ణంలో ఉన్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులను నాణ్యత తో చేపట్టాలని ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
కొత్తూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గొట్టిపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఐటీ డీఏ డీవైఈవో నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎస్‌ఏ-2కి సన్నద్ధం కావాలని సూచించారు. విద్యార్థులు బస చేసే గదులు, మరుగుదొడ్లు తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఎంవో పొట్నూరు కోటిబాబు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.