Share News

ఒంటిగంట దాటితే వ్యాక్సిన్‌ వేయరట

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:56 PM

కుక్కకాటుకు వేసే వ్యాక్షన్‌ను మధ్యాహ్నం ఒంటి గంటదాటితే వేయ మని కొండములగాం సీహెచ్‌సీ సిబ్బంది కరాఖండీగా చెబుతున్నారు.

ఒంటిగంట దాటితే వ్యాక్సిన్‌ వేయరట

రణస్థలం: కుక్కకాటుకు వేసే వ్యాక్షన్‌ను మధ్యాహ్నం ఒంటి గంటదాటితే వేయ మని కొండములగాం సీహెచ్‌సీ సిబ్బంది కరాఖండీగా చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెట్టవలస గ్రామానికి చెందిన పిన్నింటి రమణ ఈనెల 13న కుక్క కాటుకు గురయ్యడు. దీంతో అదే రోజు ర్యాబిస్‌ వ్యాక్షన్‌ (ఏఆర్‌వీ) మొదటి డోస్‌ ఇదే సీహెచ్‌ సీలో వేయించుకున్నాడు. రెండో డోస్‌ 16వ తేదీన వేయాల్సి ఉంది. దీంతో రమణ మంగళవారం సాయంత్రం రెండో డోస్‌ వేయించుకునేందుకు సీహెచ్‌సీకి వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత వ్యాక్సిన్‌ వేయమని సిబ్బంది చెప్పారు. సకాలంలో రెండో డోస్‌ వేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించాడు. తనక ఏమైన జరి గితే సీహెచ్‌సీ సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుతిరిగాడు. దీనిపై సహెచ్‌సీ సిబ్బందిని వివరణ కోరగా మధ్యాహ్నాం ఒంటిగంట దాటితే రేబిస్‌ రెండో డోస్‌ వేయలేమని, ఉదయం పూటే వేస్తామని సమాధానం చెప్పడం విశేషం.

Updated Date - Apr 16 , 2024 | 11:56 PM