Share News

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

ABN , Publish Date - May 25 , 2024 | 11:54 PM

ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లె గ్రామాల్లో రాజకీ య దురుద్దేశాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆమదాల వలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.దివాకర్‌ యాదవ్‌ అన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
సరుబుజ్జిలి: మాట్లాడుతున్న సీఐ దివాకర్‌ యాదవ్‌

సరుబుజ్జిలి: ప్రశాంత వాతావరణంలో ఉన్న పల్లె గ్రామాల్లో రాజకీ య దురుద్దేశాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని ఆమదాల వలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.దివాకర్‌ యాదవ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రమైన సరుబుజ్జిలి జంక్షన్‌లో ఎస్‌ఐ బి.నిహార్‌ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ప్రజా అవగాహన కార్యక్రమంలో సీఐ పాల్గొని మాట్లాడారు. చిన్న పాటి మనస్పర్థలతో వివాదాలు కొని తెచ్చుకోవద్దన్నారు. ఎన్నికల సంఘం నిబంఽధనల మేరకు నిషేధించబడిన ఫలితాల రోజు బాణసంచా, ర్యాలీలు, ఊరేగింపులకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు.

చల్లపేట గ్రామంలో...

గార: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చల్లపేటలో శనివారం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్టు ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు. శనివారం వేకువ జామున 5 గంటల నుంచి 7 గంటల వరకు సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి ప్రతీ ఇంటిలో సోదాలు చేశామన్నారు. ధ్రువపత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.

చీడివలస గ్రామంలో..

బూర్జ: చీడివలస గ్రామంలో శనివారం ఎస్‌ఐ జీవీ ప్రసాద్‌ ఆధ్వర్యం లో ఇంటింటికి వెళ్లి పత్రాలు లేని వాహనాలను పట్టుకున్నారు. ఆ గ్రామం లో ఆరు ద్విచక్ర వాహనాలు పత్రాలు లేనివిగా గుర్తించారు. అనంతరం కొల్లివలస జంక్షన్‌లో పలువురు వాహనదారులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలన్నారు. వాహనాలకు తప్పనిసరిగా పత్రాలు ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు.

పెద్దమురహరిపురంలో..

వజ్రపుకొత్తూరు: పెద్దమురహరిపురంలో శనివారం వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ రామారావు ఆధ్వ ర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టారు. ఎన్నికల నిబంధ నల మేరకు సమస్యాత్మక గ్రామాల్లో తనిఖీ చేపడు తున్నట్లు ఎస్‌ఐ తెలి పారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా గ్రామాల్లో ఎలాంటి తగదాలు, అల్లర్లు లేకుండా చూసుకోవాలన్నారు. ఈనెల 13న పోలింగ్‌ సమయంలో వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన సమయంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య తగాదా అయిన నేపథ్యంలో గ్రామంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మరిన్ని గ్రామాల్లో కూడా కార్డెన్‌ సెర్చ్‌ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 11:54 PM