Share News

వివాదాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Apr 02 , 2024 | 11:31 PM

ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వివాదాలకు దూరంగా ఉండాలని పాతపట్నం సీఐ నల్లి సాయి సూచిం చారు. సోమవారం రాత్రి వసుంధర గ్రామంలో ప్రజలతో మా ట్లాడుతూ పలు సూచనలు చేశారు.

వివాదాలకు దూరంగా ఉండాలి
మెళియాపుట్టి: మాట్లాడుతున్న పాతపట్నం సీఐ నల్లి సాయి

మెళియాపుట్టి: ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వివాదాలకు దూరంగా ఉండాలని పాతపట్నం సీఐ నల్లి సాయి సూచిం చారు. సోమవారం రాత్రి వసుంధర గ్రామంలో ప్రజలతో మా ట్లాడుతూ పలు సూచనలు చేశారు. నేర ప్రవర్తన కలిగిన వ్యక్తులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహక రించాలని కోరారు. ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే సమా చారం అందించాలన్నారు. తగాదాలు పడితే బైండోవర్‌ కేసులు నమోదు చేయటం జరుగు తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ టి.రాజేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి

పోలాకి: సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా మని సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ సత్యనారా యణ తెలిపారు. మంగళవారం ఎన్నికల నిఘా ప్రత్యేక పోలీసులు డోల గ్రామంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస రాం, గంగివలస, డోల, ప్రియాగ్రహారం, బెలమర, దీర్గాశి గొల్లలవలస, కోడూరు, తలసముద్రం గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారన్నారు. ఆయా గ్రామాల ప్రజా ప్రతి నిధులు, గ్రామపెద్దలకు ఎన్నికల నిబంధనలు తెలియజేస్తా మన్నారు. ఎన్నికల కోడ్‌ తొలగించే వరకు నిబంధనలు అమలులో ఉంటాయన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 11:31 PM