Share News

ఉద్యోగాల నుంచి తొలగింపు

ABN , Publish Date - Jan 06 , 2024 | 11:48 PM

విధుల్లో నిర్లక్ష్యం వహించిన క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఐదుగురు ఆర్‌బీకే సిబ్బందిని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించినట్లు జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉద్యోగాల నుంచి తొలగింపు

శ్రీకాకుళం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహించిన క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఐదుగురు ఆర్‌బీకే సిబ్బందిని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించినట్లు జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌లో కాంట్రాక్టు విధానంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌.. బియ్యం నాణ్యతా ప్రమాణాలు పరిశీ లించడంలో అలసత్వం వహించారు. దీని కారణంగా ఆమెను విధుల నుంచి తొల గించినట్లు చెప్పారు. అలాగే, మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు తప్పుడు ట్రక్‌ షీట్లను జనరేట్‌ చేసి, వేరే వాహనాల్లో ధాన్యం తరలించిన ఆర్‌బీకే డేటా ఎంట్రీ ఆప రేటర్లు ఎల్‌.హేమలత (పెద్దలంబ, సారవకోట), వి.యోగీశ్వరి (కిన్నెరవాడ, సారవ కోట), కృష్ణ (చోడవరం, నరసన్నపేట), షణ్ముఖరావు (పాలవలస, సరుబుజ్జిలి), ఎం.గౌరి నాయుడు (కొండవలస, సరుబుజ్జిలి)ను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలిపారు.

Updated Date - Jan 06 , 2024 | 11:49 PM