Share News

వంశధార కుడి కాలువ ద్వారా నీరు విడుదల

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:08 PM

గొట్టా బ్యారేజి కుడి ప్రధాన కాలువ ద్వారా సోమ వారం సాగు నీటిని విడుదల చేశారు.

వంశధార కుడి కాలువ ద్వారా నీరు విడుదల
గొట్టా బ్యారేజి కుడి కాలువ ద్వారా ప్రవహిస్తున్న సాగునీరు

హిరమండలం: గొట్టా బ్యారేజి కుడి ప్రధాన కాలువ ద్వారా సోమ వారం సాగు నీటిని విడుదల చేశారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఈనెల మొదటి వారంలో నీరరు విడిచి పెట్టిన సంగతి తెలిసిందే. కుడి కాలు వలో పూడికతీత, గుర్రపుడెక్క తొల గింపు పనులు చేపట్టడంతో 12 రోజు లు ఆలస్యంగా నీటిని విడిచిపెట్టారు. ప్రస్తుతం వంశధార నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తుండడంతో 100 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. హిర మండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, బూర్జ, శ్రీకాకుళం రూరల్‌ మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు వంశధార అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎడమ కాలువ ద్వారా 1180 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. కాగా నదిలో 1000 క్యూసెక్కులు మాత్రమే ఇన్‌ ఫ్లో వస్తుండడంతో కాలువల ద్వారా నీటిని తక్కువగా విడుదల చేస్తున్నట్లు వంశధార అధికారులు చెబుతున్నారు. బ్యారేజి వద్ద 38.05 నీటి మట్టం కొనసాగుతోందని తెలిపారు.

Updated Date - Jul 15 , 2024 | 11:08 PM