Share News

ఆదిత్య ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:38 AM

అరసవల్లి ఆదిత్యుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం తొలి ఆదివారం కావడంతో భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు స్వామికి రూ. 5,63,721 ఆదాయం లభించింది. ఇందు లో టిక్కెట్ల ద్వారా రూ.2,05,200, విరాళా ల ద్వారా రూ.1,33,521, ప్రసాదాల అమ్మ కం ద్వారా రూ.2,25,000 వచ్చినట్లు ఈవో డీఎల్వీ రమేష్‌బాబు తెలిపారు.

ఆదిత్య ఆలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు

అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మాఘమాసం తొలి ఆదివారం కావడంతో భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు స్వామికి రూ. 5,63,721 ఆదాయం లభించింది. ఇందు లో టిక్కెట్ల ద్వారా రూ.2,05,200, విరాళా ల ద్వారా రూ.1,33,521, ప్రసాదాల అమ్మ కం ద్వారా రూ.2,25,000 వచ్చినట్లు ఈవో డీఎల్వీ రమేష్‌బాబు తెలిపారు. కాగా స్వామివారిని విశాఖకు చెందిన బి.వెంకట వ్యాసా నగేష్‌, ఉష దంపతులు దర్శించు కుని శాశ్వత అన్నదాన పథకానికి రూ.1,00,116 అందజేశారు. వారి ని అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

రేపటి నుంచి డోనర్‌ పాసులు తీసుకోవాలి

ఈనెల 16 రథసప్తమిని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామికి రూ.లక్ష ఆపైన విరా ళం ఇచ్చిన దాతలు ఈనెల 13 నుంచి 15వ తేదీ సాయంత్రంలోగా ఆలయంలో డోనర్‌ పాసులను తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ పాస్‌పై దాతలు 16వ తేదీ తెల్లవారు జామున 12-30 నుంచి ఉదయం ఏడుగంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతించ నున్నట్లు చెప్పారు. ఒక పాస్‌పై నలుగురు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.

మాఘ ఆదివారం ప్రత్యేక పూజలు

నరసన్నపేట: పట్టణంలో సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాఘ ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. మాఘ మాసంలో ప్రతీ ఆదివారం సూర్య నమస్కారాలతో పాటు విశేష పూజలు నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఈనెల 15 రాత్రి నుంచి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Feb 12 , 2024 | 12:38 AM