టీడీపీతోనే అభివృద్ధి: బగ్గు
ABN , Publish Date - Apr 03 , 2024 | 11:40 PM
టీడీపీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణ మూర్తి అన్నారు. బుధవారం నరసన్నపేట మండలం దేవాది, పోతయ్యవలస, సారవ కోట మండలం మాళువ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నరసన్నపేట/జలుమూరు (సారవకోట): టీడీపీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి అభ్యర్థి బగ్గు రమణ మూర్తి అన్నారు. బుధవారం నరసన్నపేట మండలం దేవాది, పోతయ్యవలస, సారవ కోట మండలం మాళువ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేసి అవ గాహన కలిగించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ- జనసేన-బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని, పార్టీ అభ్య ర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నరసన్న పేట, సారవకోట మండలాల అధ్యక్షుడు శిమ్మ చంద్రశేఖర్, కత్తిరి వెంకటరమణ, రాష్ట్ర బీసీ సెల్ కమిటీ అధికార ప్రతినిధి ధర్మాన తేజకుమార్, నేతలు యాళ్ల వేణుగోపాలరావు, గొండు సూర్యారావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, సురవరపు తిరు పతిరావు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు జగన్ వెన్నుపోటు: ఎంజీఆర్
హిరమండలం: బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సీఎం జగన్ అని, ఆయనను రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు (ఎంజీఆర్) అన్నారు. బుధవారం హిరమండలం మేజర్ పంచాయతీలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో 74 మందిని బీసీలను చంపించిన ఘనత జగన్ రెడ్డి దేనన్నారు. అంతకుముందు హిరమండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథ కాలను ప్రజల కు వివరించారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు యాళ్ల నాగేశ్వరరావు, లాడె కృష్ణ, శ్రీధర్, మకలాకర్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.