‘పల్లె పండుగ’తో గ్రామాల అభివృద్ధి
ABN , Publish Date - Oct 17 , 2024 | 11:56 PM
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లె పండుగ’ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తు న్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
- శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం రూరల్/గార, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లె పండుగ’ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తు న్నట్టు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం కల్లేపల్లి, పీజీ పేట, నైరా, పొన్నాం, బట్టేరు గ్రామాల్లో అ భివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడా రు. ప్రజలు తమపై ఉంచుకున్న నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా రగ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్ర మంలో ఎంపిడీవో, కూటమి నాయకులు సీర రమణ, మూకళ్ల శ్రీనివాసరావు, జయానంద్, దుంగ శ్రీధర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే గార మండలంలో ఎస్.మత్స్యలేశం, బలరాం పురం, గొంటి, రామచంద్రపురం గ్రామాల్లో నిర్వహించిన పల్లెపం డగలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, పెద్దలు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధే చంద్రబాబు అజెండా
- ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు అజెండా అని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. గురువారం వంజంగి, దూసిపేట గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండగలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. కార్య క్రమంలో కూటమి నాయకలు తమ్మినేని అప్పలనాయుడు, విద్యాసాగర్, నూకరాజు, సనపల ఢిల్లేశ్వరరావు, కంచరాన లోకేష్, తమ్మినేని చంద్రశేఖర్, పైడి లక్ష్మి, ఎంపీడీవో రోణంకి వెంకటరావు, వి.బాలమురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
పెద్దపేటలో పల్లె పండుగ
బూర్జ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): పెద్దపేట పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమం గురువారం నిర్వహించారు. రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణంనాయుడు పాల్గొని వివిధ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎంిపీడీవో తిరుపతిరావు, కూటమి నాయకులు, సచివాలయ ఇబ్బంది పాల్గొన్నారు.
పల్లెల్లో అభివృద్ధే లక్ష్యం
- నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లెపండగ’ కార్యక్రమం చేపడుతున్నామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఉప్పరిపేట, డోలపేట గ్రామాలను అనుసంధానం చేస్తూ లుకలాం వరకు రూ.2 కోట్లతో రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. చిక్కాలవలస, కోమర్తి పంచాయతీ లకిమేర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు శిమ్మ చంద్రశేఖర్, బగ్గు అర్చన, పంగ బావాజీ నాయుడు, శిమ్మ జగన్నాథం, అడపా చంద్రశేఖర్, యాళ్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉప్పరిపేట-డోలపేట గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితిపై ఆగస్టులో ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే స్పందించి పనులకు శ్రీకారం చుట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు.