Share News

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:43 PM

ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

- ఎమ్మెల్యే గౌతు శిరీష

మందస: ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మండల పరిషత్‌ కార్యాల యంలో బుధవారం ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన సాధారణ సమావే శం నిర్వహించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి హాజరైన శిరీషను సభ్యులు, సర్పంచ్‌లు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో రైతులు నిర్లక్ష్యానికి గురయ్యారు. సాగునీటి వనరుల అభివృద్ధిని పట్టించుకో లేదు. కనీసం మరమ్మతులు చేపట్టలేదు. మండలంలో ప్రధాన నీటి వనరులైన దామోదరసాగరం, కళింగదళ్‌ రిజర్వాయరు, డబార్సింగి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తాం. గత ఐదేళ్లలో రాని వంశధార నీటిని 45రోజుల్లో పలాసకు తీసుకువ చ్చాం. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. కుక్కకాటు, పాముకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలి. శుక్రవారం నుంచి గ్రామసభలు నిర్వహించి గ్రామాలకు అవసరమైన ఉపాధి పనులను గుర్తించి ప్రణాళిక రూపొందించాలి.’ అని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో తిరుమలరావు, ఈవోపీఆర్‌డీ ఎ.రఘుపతిరావు, సివిల్‌ సప్లయ్‌డీటీ ఎస్‌.రవి, జడ్పీటీసీ సభ్యుడు సవర చంద్రన్న, వైస్‌ ఎంపీపీలు సీర ప్రసాద్‌, కె.ఆదినారాయణ పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:43 PM