Share News

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:21 AM

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం గురుగుబిల్లి, రావివలస గ్రామాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌ ఆరు పథకాలకు సంబంధించి ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు.

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం
శ్రీకాకుళం రూరల్‌: సింగుపురంలో ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి

- టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు

లావేరు: చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. శనివారం గురుగుబిల్లి, రావివలస గ్రామాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్‌ ఆరు పథకాలకు సంబంధించి ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్‌రెడ్డి పా లనలో రాష్ట్రం అథోగతి పాలైయిందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర, గురు గుబిల్లి సర్పంచ్‌ బాడిత లక్ష్మణరావు, నాయకులు బాడిత చిట్టిబాబు, డి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. గురుగుబిల్లికి చెందిన దొండపాటి వెంకటరావు, బాలకృష్ణ, మల్లేష్‌తో పాటు మరో 10కుటుంబాల వారు వైసీపీ, ఇతర పార్టీల నుంచి టీడీపీలో చే రారు. వీరందరికీ కళా వెంకటరావు టీడీపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

బాబుతోనే రాష్ట్రానికి భవిష్యత్‌

జి.సిగడాం: విజన్‌గల నాయకుడు చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్‌ సాధ్యమని మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, మదుపాం సర్పంచ్‌ బోగాది అప్పలనా యుడు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కూనుబిల్లి కూర్మారావు అన్నారు. శనివారం మదుపాం, డీఆర్‌ వలస, బాతువ, పెంట, గొబ్బూరు, పెనసాం, దేవరవలస తదితర గ్రామాల్లో నిర్వహించిన బాబుష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమంలో వారు మాట్లాడారు కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కుదిరెళ్ల బుజ్జి, మండల ప్రధాన కార్యదర్శి జక్కంపూడి దాసు, సర్పంచ్‌ మహాదాశఽ్యం చిన్నారావు, మక్క నారాయణరావు, కూనుబిల్లి శ్రీనివాసరావు, కె.సంతోష్‌కుమార్‌, మీసాల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్య పరిష్కారానికి పెద్దపీట

శ్రీకాకుళం రూరల్‌: సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయనున్నట్టు శ్రీకాకు ళం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. సింగుపురం గ్రామంలో శనివారం సాయంత్రం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారం టీ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి పర్యటించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు బోరుబద్ర పాపారావు, మండల రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బలగ మురళి, నాయకులు చీపురు ఆనంద్‌, జి.అప్పలరాజు, ఎం.అసిరినాయుడు, రమణ, రమేష్‌, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి

జలుమూరు, (సారవకోట): చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ అన్నారు. అన్నుపురంలో శనివారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు తాడేల భీమారావు, ఇస్సే నాగరాజు, యడ్ల పాపారావు పాల్గొన్నారు.

చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

కొత్తూరు: ‘రా..కదలిరా’ పేరుతో శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి కోరారు. మాతలలోని కార్యాలయంలో టీడీపీ నేత లతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళంలో నిర్వహించ నున్న బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ.. రానున్నది టీడీపీ- జనసేన ప్రభుత్వమన్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రా కదలిరా’ సభకు తరలిరావాలి

పాతపట్నం: శ్రీకాకుళంలో ఈనెల 26న నిర్వహించనున్న ‘రా కదలిరా’ కార్యక్రమానికి ప్రజలంతా తరలి రావాలని టీడీపీ నాయకుడు మామిడి గోవిందరావు ఒక ప్రకటనలో కోరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటున్న సభకు పాతపట్నం నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు హాజరుకావాలని కోరారు.

బహిరంగ సభకు తరలిరండి

జలుమూరు, (సారవకోట): శ్రీకాకుళంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 26న నిర్వహించనున్న ‘రా.. తర లిరా’ బహిరంగ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. సవరడ్డపనస పార్టీ కార్యాలయంలో శనివారం టీడీపీ నేతలు, కార్యకర్త లతో సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో మండల పరిశీలకుడు రమేష్‌కుమార్‌, టీడీపీ రాష్ట్ర బీసీ కమిటీ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, జలుమూరు, సారవకోట మండలాల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ, నాయకులు సాధు చిన్ని కృష్ణంనాయుడు, సురవరపు తిరుపతిరావు, బగ్గు గోవిందరావు, వెలమల చంద్రభూషణరావు పాల్గొన్నారు.

సభను విజయవంతం చేయాలి

పొందూరు: జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఈ నెల 26న టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించనున్న రా.. కదలిరా సభను కార్య కర్తలు, అభిమానులు, నాయకులు విజయ వంతం చేయాలని కార్యక్రమ ఆమదాలవలస నియోజక వర్గ పరిశీలకులు బత్తుల తాతయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో శనివారం మండల పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌తో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వేలాది సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Updated Date - Feb 25 , 2024 | 12:21 AM