Share News

నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:18 PM

విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించు కోవాలని, దీనికి ఇటువంటి కార్యక్రమాలను వినియోగించు కోవాలని రాష్ట్ర ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌ టెంటు అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో జాతీయస్థాయి గోకార్ట్‌ చాంపియన్‌షిప్‌-2కే24, సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన యాక్‌తాన్‌- 2కే24 పోటీలను మంగళవారం ఆయన ప్రారంభిం చారు.

 నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అనిల్‌ టెంటు, డా.సోమేశ్వరరావు

కె.కొత్తూరు (టెక్కలి): విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను పెంపొందించు కోవాలని, దీనికి ఇటువంటి కార్యక్రమాలను వినియోగించు కోవాలని రాష్ట్ర ఇన్నోవేషన్‌ సొసైటీ సీఈవో అనిల్‌ టెంటు అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో జాతీయస్థాయి గోకార్ట్‌ చాంపియన్‌షిప్‌-2కే24, సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందిన యాక్‌తాన్‌- 2కే24 పోటీలను మంగళవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఇన్నోవేషన్‌ సొసైటీ సైతం 40 యూనివర్సిటీలతో కలిపి యాక్‌ తాన్‌ వంటి పోటీలను నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలను ఐతం కళాశాల నిర్వహించడం అభినం దనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వర రావు, కార్యదర్శి ఎల్‌ఎల్‌ నాయు డు, కోశాధికారి టంకాల నాగరాజు, డైరెక్టర్‌ వీవీ నాగేశ్వర రావు, ప్రిన్సిపాల్‌ ఏఎస్‌ శ్రీనివాసరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 11:18 PM