Share News

నాణ్యతా లోపాలు కనిపిస్తే బిల్లుల నిలుపుదల

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:42 PM

మండలంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వేస్తున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం కనిపిస్తే బిల్లులు నిలుపుదల చేస్తామని టెక్కలి ఉపాధి ఏపీడీ శైలజ అన్నారు.

 నాణ్యతా లోపాలు కనిపిస్తే బిల్లుల నిలుపుదల
కేరాశింగి రోడ్డు పనులను పరిశీలిస్తున్న ఉపాధి ఏపీడీ శైలజ

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

మెళియాపుట్టి: మండలంలోని కొండలపై ఉన్న గ్రామాలకు వేస్తున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపం కనిపిస్తే బిల్లులు నిలుపుదల చేస్తామని టెక్కలి ఉపాధి ఏపీడీ శైలజ అన్నారు. ఈనెల 6న ‘ఆంధ్రజ్యోతి’లో ‘గిరిజనులంటే ఇంత నిర్లక్ష్యమా’ శీర్షికతో వచ్చిన కథనంపై ఐటీడీఏ పీవో కల్పనాకుమారి స్పందిం చారు. ఈ మేరకు పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఏపీడీని ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం కేరాశింగి, చందనగిరి, అడ్డివాడ, గూడ రహదారి పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చి తంగా పాటించాలన్నారు. ఆమెతో పాటు ఏపీవో రవి, ఈసీ ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:42 PM