Share News

ఆశా కార్యకర్తల నిర్బంధం

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:59 PM

జిల్లాలోని ఆశా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వారిని వెళ్లనీయకుండా పోలీసు లు ముందస్తుగా అడ్డుకున్నారు.

   ఆశా కార్యకర్తల నిర్బంధం
హిరమండలం పోలీసు స్టేషన్‌లో..

- విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

- నోటీసులు అందించి స్టేషన్‌కు తరలింపు

నందిగాం/సరుబుజ్జిలి/హిరమండలం, ఫిబ్రవరి 7: జిల్లాలోని ఆశా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వారిని వెళ్లనీయకుండా పోలీసు లు ముందస్తుగా అడ్డుకున్నారు. బుధవారం ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చి నిర్బంధించారు. పలువురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నందిగాం మండలంలోని పాలవలస, జడ్యాడ, నందిగాం, సరుబుజ్జిలి మండలంలోని ఏఎల్‌ నగరం, నందికొండ, ఆమదాలవలస మండలంలోని బొబ్బిలిపేట, తదితర గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన ఆశ కార్యకర్తలను సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు నిర్బంధించి అనంతరం పూచీకత్తులతో విడిచిపెట్టారు. హిరమండలం ఆశా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో కొంత సమయం ఉంచారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పనిభారం తగ్గించాలని, వేతనాలు పెంచాలని, అధికారుల ఒత్తిడి లేకుండా చూడాలని, యాప్‌ల భారం నుంచి కొంతమేర ఉపశమనం ఇవ్వాలని, సెలవులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 07 , 2024 | 11:59 PM