Share News

కుమార్తె పెళ్లి సంబంధానికి వెళ్తూ మృత్యుఒడిలోకి..

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:12 AM

కుమార్తె పెళ్లి సంబంధం నిమిత్తం వెళ్తూ ఓ తండ్రి మృత్యుఒడిలోకి వెళ్లిన ఘటన బుధవారం విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిి పన వివరాలిలా ఉన్నాయి..

కుమార్తె పెళ్లి సంబంధానికి వెళ్తూ మృత్యుఒడిలోకి..

-అదుపుతప్పి బైక్‌ని ఢీకొన్న కారు

- మరొకరికి తీవ్ర గాయాలు

నందిగాం: కుమార్తె పెళ్లి సంబంధం నిమిత్తం వెళ్తూ ఓ తండ్రి మృత్యుఒడిలోకి వెళ్లిన ఘటన బుధవారం విషాదం నింపింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిి పన వివరాలిలా ఉన్నాయి.. మెళియాపుట్టి మండలం జర్రిభద్రకు చెందిన వంజంగి గణపతి (51) అదే గ్రామానికి చెందిన కొర్ల జనార్దనరావుతో కలిసి కుమార్తె పెళ్లి సంబంధం నిమిత్తం ద్విచక్రవాహనంపై టెక్కలి వెళ్తున్నారు. అయితే టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న కారు పెద్దబాణాపురం సమీపంలో హైవేపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుపై బోల్తాపడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న గణపతిరావు, జనార్దనరావులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గణపతి చికిత్స పొందుతూ మృతిచెందా డు. జనార్దనరావుకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గణపతి భార్య ఆమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెచ్‌సీ ఢిల్లేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్పగాయాలవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నందిగాం: నందిగాం దిగువ బీసీ కాలనీకి చెందిన నక్క బాలకృష్ణ (34) రోడ్డు ప్రమాదానికి గురై ఆసుప త్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నందిగాం అండర్‌పాసేజ్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలో వెల్డింగ్‌షాపు నిర్వహి స్తున్న బాలకృష్ణ మంగళవారం సాయంత్రం పెద్ద తామరాపల్లి పని నిమిత్తం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహ నంపై ఇంటికి వస్తుండగా మద్దిలివానిపేట సమీపంలో హైవేపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యా యి. వెంటనే అతడిని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. అందరితో కలివిడిగా ఉండే బాలకృష్ణ మృతి చెందడంతో నంది గాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయనకు ఏడేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు కుమారులు సిద్ధి విలాస్‌ (5), కౌసిక్‌(3) ఉన్నారు. బాలకృష్ణ మృతితో భార్య మహాలక్ష్మి, తల్లిదండ్రులు బానమ్మ, కామయ్య, ఇతర కుటుంబసభ్యులు రోదనలతో ఆ ప్రాంతం కన్నీటిపర్యంతమైంది. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నందిగాం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకుడు..

లావేరు: బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం వేకుజామున విశా ఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యాచకుడు మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వ జన ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Feb 01 , 2024 | 12:12 AM