Share News

సామాజిక చైతన్యం కోసం సైకిల్‌ యాత్ర

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:48 PM

లక్నో ఆలిండియా రేడియోలో జాకీగా పనిచేస్తున్న సంపూర్ణ శుక్లా ‘సేవ్‌ వాటర్‌.. సూవ్‌ లైఫ్‌’ అనే నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టాడు. గత ఏడాది ఆగస్టు 3న సైకిల్‌ యాత్ర ప్రారం భించి వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయా ణిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాడు.. అలాగే అయోధ్యకు చెందిన దినకర్‌దాస్‌ ‘మద్యపానం, మాదక ద్రవ్యా ల వల్ల కలిగే నష్టం’పై యువతను చైతన్యం చేసేందుకు శాంతికుండ్‌ ఆశ్రమం నుంచి బయలు దేరి యాత్ర సాగి స్తున్నాడు.. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలైనా యాదృచ్ఛికంగా ఇద్ద రూ సైకిల్‌ యాత్ర చేస్తూ ఒడిశాలో ఒకరికొకరు తారస పడా ్డరు. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవడంతో పాటు ఇద్దరి ఆలోచనల సారం ఒకటే కావడం తో అక్కడి నుంచి కలిసే సైకిల్‌ యాత్ర చేపడుతున్నారు.

సామాజిక చైతన్యం కోసం సైకిల్‌ యాత్ర
సైకిల్‌ యాత్ర చేస్తున్న సంపూర్ణ శుక్లా, దినకర్‌దాస్‌

పలాస చేరుకున్న సంపూర్ణ శుక్లా, దినకర్‌దాస్‌

పలాస, జనవరి 9: లక్నో ఆలిండియా రేడియోలో జాకీగా పనిచేస్తున్న సంపూర్ణ శుక్లా ‘సేవ్‌ వాటర్‌.. సూవ్‌ లైఫ్‌’ అనే నినాదంతో సైకిల్‌ యాత్ర చేపట్టాడు. గత ఏడాది ఆగస్టు 3న సైకిల్‌ యాత్ర ప్రారం భించి వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయా ణిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాడు.. అలాగే అయోధ్యకు చెందిన దినకర్‌దాస్‌ ‘మద్యపానం, మాదక ద్రవ్యా ల వల్ల కలిగే నష్టం’పై యువతను చైతన్యం చేసేందుకు శాంతికుండ్‌ ఆశ్రమం నుంచి బయలు దేరి యాత్ర సాగి స్తున్నాడు.. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలైనా యాదృచ్ఛికంగా ఇద్ద రూ సైకిల్‌ యాత్ర చేస్తూ ఒడిశాలో ఒకరికొకరు తారస పడా ్డరు. ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకోవడంతో పాటు ఇద్దరి ఆలోచనల సారం ఒకటే కావడం తో అక్కడి నుంచి కలిసే సైకిల్‌ యాత్ర చేపడుతున్నారు. వీరిరువురూ.. సోమ వారం రాత్రి దాటిన తరువాత పలాస రైల్వేస్టేషన్‌ రోడ్డులో సీతారామాలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో యాత్రను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. నీరు సకల జీవ రాసులకు అవసరమైందని, దీన్ని దుర్వినియోగం చేయవద్ద న్నారు. మాదక ద్రవ్యాలు, మద్యపానం వల్ల యువత చెడి పోతున్నారని, సంఘంలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు ఈ రెండే ప్రధాన కారణమని, దీన్ని నిర్మూలించాలనే తపనతో యాత్రను ప్రారంభించామన్నారు. అన్ని రాష్ట్రాల్లో తమకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని వివరించారు.

Updated Date - Jan 09 , 2024 | 11:49 PM