Share News

చేయూత సదస్సులో ఆకలి కేకలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:06 AM

మండల సమాఖ్య ఆధ్వర్యంలో సుభద్రాపురం జంక్షన్‌ వద్ద సోమవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కుల పంపినీ సదస్సుకు వచ్చిన చాలా మంది మహిళలకు సరిపడ భోజనాలు లేక ఆకలి కేకలు వేశారు.

చేయూత సదస్సులో ఆకలి కేకలు

లావేరు: మండల సమాఖ్య ఆధ్వర్యంలో సుభద్రాపురం జంక్షన్‌ వద్ద సోమవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కుల పంపినీ సదస్సుకు వచ్చిన చాలా మంది మహిళలకు సరిపడ భోజనాలు లేక ఆకలి కేకలు వేశారు. ఈ పథకం కింద మండలంలో 4,994 మంది అర్హత గల మహిళలకు రూ.9.36 కోట్లు మేరకు లబ్ధి చేకూరింది. అయితే వీరికి స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ చేతులు మీదుగా చెక్కులను పంపినీ చేస్తారని చెప్పి మండల ఐకేపీ సిబ్బంది అధిక సంఖ్యలో లబ్ధిదారులను మండల కేంద్రానికి తరలించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వారంతా అవస్థలుపడ్డారు. ముఖ్యంగా సరిపడ భోజనాలు లేకపోవడంతో వారంతా ఇబ్బందిపడ్డారు. భోజనాలకు తోపులాడుకోవడం తో పోలీసులు వారికి సర్థి చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి భోజనం దరొకినోలు తిన్నారు.. లేనివారు ఈసురోమంటూ ఆకలితో తిరిగి పయనమయ్యారు. ఈ సదస్సులో ఎంపీపీ లుట్ల అమ్మాజమ్మ, జడ్పీటీసీ మీసాల సీతంన్నాయుడు, ఎంపీడీవో కొండలరావు, ప్రత్యేకాహ్వానితులు రొక్కం బాలకృష్ణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బూరాడ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:06 AM