Share News

వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:43 PM

రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలనపై పలాస నియోజక వర్గంలో అన్ని పంచాయతీలు, మునిసిపల్‌ వార్డుల్లోని వైసీపీ నాయకులు విసుగు చెంది టీడీపీలో చేరుతున్నారని, దీంతోనే వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి 6వ వారు అంతరకుడ్డ, పెసరపాడులో పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.

 వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభం
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన మాజీ కౌన్సిలర్‌ ధనుంజయ్‌ తదితరులతో శిరీష

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పెసరపాడులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

కాశీబుగ్గ, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో సాగుతున్న రాక్షసపాలనపై పలాస నియోజక వర్గంలో అన్ని పంచాయతీలు, మునిసిపల్‌ వార్డుల్లోని వైసీపీ నాయకులు విసుగు చెంది టీడీపీలో చేరుతున్నారని, దీంతోనే వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి 6వ వారు అంతరకుడ్డ, పెసరపాడులో పల్లె పల్లెకు టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి మళ్లి పోయిందని విమర్శించారు. ప్రజలందరూ అంధకారంలో ఉన్నారని, మళ్లీ వెలుగులు కావాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఆదరించి అధినేత చంద్రబాబును మళ్లీ సీఎంగా చేయాలని కోరారు. పలాసలో అక్రమాలు, భూ దందాలు, దాడులు పెరిగిపోవడంతో ప్రజలందరూ ఆలోచలో పడ్డారన్నారు. ఈ నేపథ్యం లోనే టీడీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయన్నారు.

పెసరపాడులో వైసీపీని వీడి టీడీపీలోకి...

పెసరపాడు గ్రామంలో మాజీ కౌన్సిలర్‌ సంపతిరావు ధనుంజయ్‌, రోణంకి కురమయ్య, రోణంకి మోహన్‌ రావు, రోణంకి రమేష్‌, కూర్మాపు మన్మథరావు, తిరుపతిరావు, అప్పారావు, పాపారావు, ధర్మపురి అప్పల స్వామి, పొన్నాడ జోగారావు తదితర వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీరికి శిరీష పార్టీ కండువాలను వేసి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, సూర్యనారాయణ, సప్ప నవీన్‌, రవి శంకర్‌ గుప్తా, శంకర్‌, రాంబాబు, ఆనంద్‌, శ్రీను, చిరంజీవి, సురేష్‌, వెంకటరమణ, సురేష్‌కుమార్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:43 PM