Share News

‘ఓటేద్దాం - శ్రీకాకుళం’పై పోటీలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:47 PM

‘ఓటేద్దాం-శ్రీకాకుళం’ అనే అంశంపై వీడియో తయారీ, పోస్టర్‌ డిజైన్‌ చేయుటకు ఆన్‌లైన్‌లో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఓటేద్దాం - శ్రీకాకుళం’పై పోటీలు

- జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26: ‘ఓటేద్దాం-శ్రీకాకుళం’ అనే అంశంపై వీడియో తయారీ, పోస్టర్‌ డిజైన్‌ చేయుటకు ఆన్‌లైన్‌లో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అందరూ ఓటింగ్‌లో ఎందుకు పాల్గొనాలనే విషయంపై అవగాహన కలిగేలా ఉండాలలి. జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచడమే దీని ఉద్దేశ్యం. ముఖ్యంగా యువత, మహిళలు, దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌, వలస కార్మికులు, పట్టణ ప్రాంతంతోపాటు గిరిజనులు ఓటింగ్‌లో పాల్గొనేలా సందేశం ఉండాలి. జిల్లాకు చెందినవారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాలి. రెండు.. మూడు నిమిషాల నిడివి వీడియో ఉండాలి. పోస్టర్‌ సైజు 20ఎంబీ లోపు ఉండాలి. ఎక్కడా పార్టీ గుర్తులు, జెండాలు, రాజకీయ నేతల వ్యాఖ్యలు ఉండరాదు. మే 3వ తేదీలోగా వీడియో/పోస్టర్లను పంపించాలి. ముగ్గురేసి విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేస్తామ’ని కలెక్టర్‌ తెలిపారు. వీడియో చిత్రీకరణకు ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.3వేలు, రూ.2వేలు చొప్పున అందజేస్తామన్నారు. పోస్టర్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి గా.. రూ.3వేలు, రూ.2వేలు, రూ.వెయ్యి చొప్పున అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 8121585151 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Apr 26 , 2024 | 11:47 PM